Surya Gochar 2023 in December: డిసెంబరు నెలలో కొన్ని కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. సూర్యుడితో సహా 5 ప్రధాన గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోబోతున్నాయి. గ్రహాల రాజైన సూర్యభగవానుడు ఈనెల 16న మధ్యాహ్నం 03:47 గంటలకు వృశ్చిక రాశిని విడిచిపెట్టి ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనినే ధను సంక్రాంతి అని పిలుస్తారు. సూర్యుడి రాశి మార్పు మెుత్తం 12 రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. భాస్కరుడి రాశి మార్పు ఏయే రాశులవారి జీవితాల్లో వెలుగులు నింపనుందో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
ఇదే రాశిలో సూర్యుడి సంచారం జరగబోతుంది. భానుడు రాశి మార్పు వల్ల ధనస్సు రాశి వారికి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. మీరు ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతారు. బిజినెస్ చేసేవారు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది.
మిధునరాశి
భాస్కరుడి సంచారం మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీ కెరీర్ లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అప్పుల బాధ నుండి బయటపడతారు.
మీనరాశి
మీన రాశి వారికి సూర్యుడి కదలిక మంచి లాభాలను ఇస్తుంది. మీరు మంచి డైట్ ను పాటించండి, లేకపోతే మీ అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు.
కన్య
భానుడి రాశి మార్పు కన్యా రాశి వారి జీవితాల్లో అనుహ్యమైన మార్పులు తీసుకురాబోతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మీ సంపద పెరుగుతుంది.
Also Read: Guru Margi 2023: జనవరి 01 నుంచి ఈ రాశుల ఫేట్ మారబోతుంది.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి