Sun transit in Scorpio 2022: 'కేంద్రీయ త్రికోణ రాజయోగం'లో సూర్యభగవానుడు.. ఈ రాశుల వారికి వరించనున్న రాజయోగం

Kendra Tirkon Rajyog 2022: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యుడు వృశ్చికరాశిలో సంచరించాడు. దీని కారణం కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 11:55 AM IST
  • వృశ్చికరాశిలో సూర్య సంచారం
  • ప్రజలందరిపై రాజయోగం తీవ్ర ప్రభావం
  • ఈ మూడు రాశులకు భారీ ప్రయోజనం
Sun transit in Scorpio 2022: 'కేంద్రీయ త్రికోణ రాజయోగం'లో సూర్యభగవానుడు.. ఈ రాశుల వారికి వరించనున్న రాజయోగం

Sun transit in Scorpio 2022: ప్రతి గ్రహం రాశిచక్రాలను మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను సృష్టిస్తాయి. ఇటీవల సూర్యుడు వృశ్చికరాశిలో ప్రవేశించాడు. దీని కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. ఈ యోగ ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. అయితే ఇది మూడు రాశులవారికి అపారమైన సంపదను ఇస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

కేంద్ర త్రికోణ రాజయోగం మీకు శుభప్రదం:

సింహం (Leo): వృశ్చిక రాశిలో కేంద్ర త్రికోణ రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసవారు మీరు మంచి డబ్బును సంపాదిస్తారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. మెుత్తానికి ఈ సమయం మీకు బాగుంటుంది. 

కుంభం (Aquarius): కేంద్ర త్రికోణ రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంలో ఏదైనా మతపరమైన లేదా శుభ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. 

మిథునం (Gemini): మిథునరాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. మీరు భాగస్వామ్య పనులలో మంచి లాభాలను సాధిస్తారు. మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. సూర్య గ్రహ ప్రభావం వల్ల ఈ సమయంలో మీ మనోబలం పెరుగుతుంది. అంతేకాకుండా మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 

Also Read: కొత్త సంవత్సరంలో మీనరాశిలోకి రాహువు... ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News