Surya Gochar 2024 today: మకర సంక్రాంతి నుండి నెల రోజులపాటు వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?

Sun Transit 2024 today: సూర్యుడు ఇవాళే మకర రాశి ప్రవేశం చేయనున్నాడు. దీనినే మకర సంక్రాంతి అంటారు. దీంతో ఈరోజు నుంచి కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2024, 10:24 AM IST
Surya Gochar 2024 today: మకర సంక్రాంతి నుండి నెల రోజులపాటు వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?

Sun transit in Makar Rashi 2024: గ్రహాలు రాజైన సూర్యుడు కదలికలో ఇవాళ మార్పు రానుంది. ఆదిత్యుడు తన కుమారుడు శనిదేవుడి రాశి అయిన మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మకర సంక్రాంతి అంటారు. పైగా తండ్రీ కొడుకుల మధ్య శత్రుత్వం ఉంది. సూర్యుడు తన కొడుకు ఇంటిలో నెలరోజులు ఉంటాడు. సంక్రాంతి నుంచి కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

సింహం: సింహ రాశి అధిపతి సూర్యుడు. అందుకే ఈ రాశి వారిపై సూర్యదేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారి కల నెరవేరుతోంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారులు లాభపడతారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. 
వృషభం: సూర్యుడి సంచారం వృషభరాశి వారికి చాలా మేలు చేస్తుంది. సంక్రాంతి నాడు వీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీరు విదేశాల్లో ఆస్తిని కొనుగోలు చేస్తారు. మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. మీకు మంచి ఫ్యాకేజీతో జాబ్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 
ధనుస్సు: సూర్యుని సంచారం ధనస్సు రాశివారికి ప్రతి పనిలో విజయాన్ని ఇస్తుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు కెరీర్ కు సంబంధించిన శుభవార్త వింటారు. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 
మీనం: సూర్యుని రాశిలో మార్పు మీన రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీ డబ్బును సంపాదించడంతోపాటు పొదుపు కూడా చేస్తారు. మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మీ లైఫ్ లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీకు పదవితోపాటు గౌరవం కూడా లభిస్తుంది. 

Also read: Sankranti Ratham Muggu: సంక్రాంతి కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు వేస్తారు..? దీని వెనుక కారణమేంటి ?

Also Read: Kanuma 2024: కనుమ పండుగ రోజు పశువులను ఎందుకు పూజిస్తారు తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News