Sankranti Ratham Muggu: సంక్రాంతి కనుమ రోజు రథం ముగ్గు ఎందుకు వేస్తారు..? దీని వెనుక కారణమేంటి ?

Ratham Muggu: పండుగ రోజున వేసే ముగ్గులకు ఎంతో  ప్రస్థిది ఉంటుంది. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో వచ్చే సంక్రాంతి పండుగలో వేసే ముగ్గులకు విశిష్ట స్థానం ఉంటుంది. అయితే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో  భోగి ,సంక్రాంతి, కనుముగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులు పాటు రంగురంగుల రంగవల్లులు వేసి ఇంటి లోగిలిని అలంకరిస్తారు. ముఖ్యంగా కనుమ రోజున రథం ముగ్గును వేస్తారు. అసలు రథం ముగ్గు ఎందుకు వేస్తారు? కనుమ రోజు ఇంటి ముందు రథం ముగ్గు ఎందుకు వేయాలి? అనే దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2024, 10:13 AM IST
Sankranti Ratham Muggu: సంక్రాంతి కనుమ రోజు  రథం ముగ్గు ఎందుకు వేస్తారు..? దీని వెనుక కారణమేంటి ?

Ratham Muggu: హిందు సనాతన ధర్మంలో సంక్రాంతి పండగకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పండుగను ఎంతో ఘనంగా హిందువులు జరుపుకుంటారు. అయితే కొందరూ సంక్రాంతిని మూడు రోజుల పండుగగా జరుపుకుంటారు.  మొదట భోగి, రెండు సంక్రాంతి, మూడు కనుమ. ఈ మూడు రోజుల పాటు  మహిళలు ఇంటి ముందు ముగ్గులు వేస్తారు.  అయితే   కనుమ రోజు రథం ముగ్గును వేయడం ఆనవాయితీగా వస్తుందని. ఎందుకు ఈ ముగ్గును తప్పని సరిగా వేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

రథం ముగ్గు ప్రత్యేకత: 

రథం ముగ్గును సూర్య భగవానుడిగా భావిస్తారు. ఈ రథం మనవుడి దేహం నడిపేవాడు పరమాత్ముడిగా భావిస్తారు. తమను సరైన దారిలో నడిపించమని సూర్య భగవానుడిని కోరుకుంటూ ఈ ముగ్గు వేస్తారు.  అంతేకాకుండా  ఈ  ముగ్గుకు పురాణ కథ ఉంది. 

రథం ముగ్గు పురాణ కథ:
 
1. పూర్వం ఒక రాజు తన కుమారుడిని కోల్పోతాడు. దీంతో తన కుమారుడిని బతికించాలని రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. రాజు తపస్సకు మెచ్చిన బ్రహ్మదేవుడు బియ్యం పిండితో తన కుమారుడి బొమ్మను గీయాలని చెబుతాడు. అప్పుడు తాను ప్రాణ ప్రతిష్ట చేస్తానని వరం ఇస్తాడు. రాజు తన కుమారుడి బొమ్మను గీస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు ప్రాణ ప్రతిష్ట చేస్తారు. అలా రాజు తన కుమారుడిని బతికించుకున్నాడు. అప్పటి నుంచి ఈ ముగ్గును జీవితం, అదృష్టం , శ్రేయస్సుకు ప్రతీకగా భావించి ఆనవాయితీగా వేస్తూ ఉంటారని పెద్దలు చెబుతుంటారు. 

Also read: Kanuma 2024: కనుమ పండుగ రోజు పశువులను ఎందుకు పూజిస్తారు తెలుసా?

2. మరికొందరూ సంక్రాంతి రోజున  బలిచక్రవర్తి  పాతాళ లోకం నుంచి మూడు రోజుల పాటు భూలోకానికి వస్తారని చెబుతారు. ఈ పండుగ పూర్తయిన తర్వత బలిచక్రవర్తిని తిరిగి సాగనంపుటకు ఇంటింటా ఈ రథం ముగ్గును వేస్తారని చెబుతారు.

ఈ విధంగా రథం ముగ్గుకు ప్రత్యేక కథలు ఉన్నాయి. ఈ ముగ్గు మనం శ్రేయస్సును కోరుతూ ఆ స్యూర దేవుడిని ప్రార్థించడం.  మీరు కూడా ఈ ముగ్గును మీ ఇంటి ముందు వేయడం వల్ల ఎన్నో శుభలాభాలు పొందుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Also read: Sankranti 2024: సంక్రాంతి రోజు ఈ రాశుల వారిపై సూర్య భగవానుడు కనక వర్షం కురిపించబోతున్నాడు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News