Surya Grahan 2022: 27 ఏళ్ల తర్వాత దీపావళి రోజున(అక్టోబర్ 25) సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఇలా పంగడ రోజున రావడం చాలా అరుదు. అయితే దీని ప్రభావం పలు దేశాలతో పాటు భారత్‌పై కూడా పడబోతోంది. అయితే ఈ సూర్యగ్రహణం దీపావళీ రోజున రాత్రి 11.28 గంటలకు నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సమయంలో పలు రకాల పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో విగ్రహారాధన చేయడం వల్ల చాలా రకాల సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. సూర్యగ్రహణం ప్రభావవం పలు రాశులపై కూడా పడబోతోంది. అయితే ఈ రాశులల్లో తీవ్ర మార్పులు రాబోతున్నట్లు శాస్త్రం పేర్కొంది. ఈ క్రమంలో మేషరాశి, వృషభ రాశి, మిథునరాశి, కర్కాటక రాశి, సింహ రాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశిల వారిపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా మీన రాశి వారికి తీవ్ర సమస్యల కూడా తలెత్తే అవకావాలు కూడా ఉన్నాయి. అయితే ఇతర రాశులవారిపై ఎలాంటి ప్రభావవం పడనుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి:
మేషరాశి వారు సూర్య గ్రహణం వల్ల కష్టాలు పడతారని జోతిష్య పండితులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో తప్పకుండా వీరు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి.
గ్రహణ సమయంలో ఏమి చేయాలి:
1. గ్రహణం ప్రారంభమయ్యే సమయం ముందే మీరు స్నానాలు వంటి కార్యాక్రమాలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
2.ఈ క్రమంలో తప్పకుండా దేవతలను పూజించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సూర్యున్ని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
3. సూర్యగ్రహం ప్రారంభ సమయంలో దానాలు చేయడం వల్ల భవిష్యత్‌లో మంచి ఫలితాలు పొందుతారు.
4. గ్రహణం ముగిసిన తర్వాత మరోసారి స్నానం చేయాలి.
5. తప్పకుండా ఈ క్రమంలో తులసి ఆకులను ఆహార పదార్థాలలో వేయాలి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి:
>>ఈ గ్రహణం సమయంలో నీటిని అస్సలు తాగకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
>>ఈ క్రమంలో కొత్త పనులు, శుభ కార్యాలు చేయకూడవు.
>>గోళ్లు కత్తిరించడం, జుట్టు దువ్వడం, పళ్లను శుభ్రం చేయకూడదు.
>>కత్తులు లేదా పదునైన వస్తువులను అస్సలు వినియోగించకూడదు.
Also Read: Mercury transit: దీపావళి నుంచి ఆ రాశులవారికి ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి, ఊహించని డబ్బు
Also Read: Mercury transit: దీపావళి నుంచి ఆ రాశులవారికి ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి, ఊహించని డబ్బు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook