Surya Grahan 2023: ఈ రాశులవారు షాక్‌, సూర్య గ్రహణం కారణంగా తీవ్ర నష్టాలు, మీ రాశి ఉంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Solar Eclipse 2023: సూర్య గ్రహణ సమయంలో తప్పకుండా అందరూ పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని రాశులవారు మాత్రం ఈ కింది నియమాలను పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2023, 04:50 PM IST
Surya Grahan 2023: ఈ రాశులవారు షాక్‌, సూర్య గ్రహణం కారణంగా తీవ్ర నష్టాలు, మీ రాశి ఉంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Surya Grahan 2023 Upay: ఈ సంవత్సరం మొదటి సూర్య గ్రహణం రేపే జరగబోతోంది. ఉదయం 7.4 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 గంటలకు ముగుస్తుంది. గ్రహణ వ్యవధి 5 ​​గంటల 24 నిమిషాలు ఉండబోతోంది. అయితే భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు..సుతక కాలం కూడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దీని ప్రభావం మూడు రాశులవారిపై ప్రభావం పడబోతోంది. కాబట్టి ఈ క్రమంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.  

మేషరాశిపై సూర్యగ్రహణం ప్రభావాలు:
మేష రాశి వారికి సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కారణంగా చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ రాశివారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏలాంటి కొత్త వస్తువులను కొనుగోలు చేయోద్దు. ఈ క్రమంలో ఆస్తులు కొనుగోలు చేస్తే తీవ్ర నష్టాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరు మానసిక, శారీరక బాధలకు గురవుతారు. కాబట్టి ఆర్థిక విషయాల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

సింహరాశి:
సూర్యుడు సింహ రాశికి అధిపతిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ క్రమంలో సింహరాశివారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడబోతోందని నిపుణులు చెబుతున్నారు. సంచారం కారణంగా ఈ రాశివారు తీవ్ర అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. లాభాలు తగ్గి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇతరలతో పరస్పర సంబంధాలు కూడా ఎదురవుతాయి. కాబట్టి సూర్య గ్రహణ సమయంలో రాగి పాత్రలో మందార పువ్వులు నివారణ చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?

కన్యారాశి:
కన్యారాశి వారికి సూర్యగ్రహణం కారణంగా జీవితంలో అనేక రకాల సమస్యలను వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వ్యాపారంలో భారీ నష్టాలు సంభవించవచ్చు. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన తీవ్ర ఇబ్బందుల పాలవుతారు. ఈ గ్రహణం వైవాహిక జీవితంపై  అననుకూల ప్రభావాలను కలిగిస్తుంది. కుటుంబంలో అందరి ఆరోగ్యం క్షీణించే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో ప్రతి ఆదివారం సూర్యుడిని పూజించి గోవుకు పాలకూర తినిపించండి.
 
సూర్యగ్రహణం సమయంలో ఈ జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది:
సూర్యగ్రహణం సమయంలో అందరూ తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి సుతక కాలం లేకపోవడం వల్ల కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సూర్యగ్రహణం సమయంలో విష్ణుసహస్త్రాణం పఠించండి. గ్రహణ సమయంలో ఇంట్లో ఉండే దేవుడి విగ్రహాలకు కటన్ దుస్తువులను కప్పి ఉంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో ఆహారాలు తీసుకోవడం కూడా మానుకోవాల్సి ఉంటుంది.

Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News