Surya Shukra Conjunction 2022: ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. ప్రేమ, శృంగారం, సంపద మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడైన శుక్రుడు వచ్చే నెల ప్రారంభంలో అంటే డిసెంబరు 5న శుక్రుడు ధనుస్సు రాశిలో ప్రవేశించనున్నాడు. అనంతరం అదే రాశిలోకి సూర్యభగవానుడు డిసెంబరు 16న సంచరించనున్నాడు. శుక్రుడు, సూర్యుడు ఇద్దరు శత్రువులు. ఒకే రాశిలో రెండు శత్రు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులవారు లాభపడనున్నారు. డిసెంబర్ 29న మళ్లీ శుక్రుడు మకరరాశిలో సంచరించనున్నాడు. ధనుస్సు రాశిలో సూర్య, శుక్రు గ్రహాల సంయోగం (Sun and venus Conjunction 2022) వల్ల ఏ రాశులవారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం.
సింహ రాశి (Leo): ధనుస్సు రాశిలో సూర్య శుక్రల కలయిక వల్ల సింహరాశి వారికి మేలు జరుగుతుంది. మీరు ఏ కార్యం తలపెట్టినా అందులో సఫలీకృతులవుతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఇతరులతో మీ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.
తుల రాశి (Libra): శుక్ర, సూర్యల కలయిక వల్ల తులరాశి వారు అపారమైన ప్రయోజనం పొందనున్నారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు ఆర్థికంగా బలపడతారు. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు జీతంలో పెరుగుదల ఉంటుంది. అంతేకాకుండా ప్రమోషన్ పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది.
వృశ్చిక రాశి (Scorpio): రెండు శత్రు గ్రహాల సంచారం వల్ల వృశ్చికరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా లాభాలు ఉంటాయి. పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius): ధనస్సు రాశిలో సూర్య, శుక్రుడి కలిసి 25 రోజులపాటు ఉంటారు. సమాజంలో గౌరం పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి.
Also Read: December 2022 Horoscope: డిసెంబరులో ఈ 3 రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి