Mars Transit 2023 Effects: ఈ రాశులవారికి 49 రోజుల పాటు కష్టాలు, నష్టాలు తప్పవా?

Mars Transit 2023 Effects: జూలై 1వ తేదిన కుజుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా అన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారి జీవితాల్లో మార్పలు సంభవిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 27, 2023, 11:04 AM IST
Mars Transit 2023 Effects: ఈ రాశులవారికి 49 రోజుల పాటు కష్టాలు, నష్టాలు తప్పవా?

Mars Transit 2023 Effects On Zodiac Signs: కుజుడు వచ్చేనెల 1వ తేదీన సింహరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. సింహరాశిలోనే 49 రోజులపాటు సంచార దిశలోనే ఉండబోతున్నాడు. ఇదే క్రమంలో కుంభరాశిలోకి శని గ్రహం కుడివైపు నుంచి తిరోగమనము చేయబోతోంది. అయితే ఈ రెండు గ్రహాల కదలిక కారణంగా ఓ ప్రత్యేక యోగం ఏర్పడబోతోంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సంచారాల కారణంగా అన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అనుకూల ప్రయోజనాలు జరిగితే..మరికొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. కుజుడు శని కదలికల కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశుల వారిపై కుజ శని గ్రహాల ఎఫెక్ట్..
మేష రాశి:

మేష రాశి వారికి ఈ క్రమంలో అన్ని రంగాల్లో పురోగతి లభిస్తుంది. కొత్తగా ఆదాయ వనరులు ఏర్పడడమే కాకుండా సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా కష్టపడి పనిచేసే వారికి ఫలితం నీ వెంటే వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

వృషభం రాశి:
వృషభ రాశివారు ఈ 49 రోజుల పాటు మిశ్రమ ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా వీరు స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీరు కొన్ని విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. లేకపోతే వివాదాల్లో చిక్కుకునే ఛాన్స్ కూడా ఉంది. 

మిథున రాశి: 
ఈ రాశివారికి జీవితంలో చాలా రకాల  మార్పులు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరు ఉద్యోగాలు మారే ఛాన్స్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్వల్పకాల ప్రయాణాలు కూడా చేస్తారు. 

Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   

కర్కాటక రాశి:
 కర్కాటక రాశి వారికి కుజుడి, శని స్థాన చలనం కారణంగా అనారోగ్య సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు వచ్చే ఛాన్స్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తప్పడు నిర్ణయాల కారణంగా ఆర్థిక సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌ ఉంది.

సింహ రాశి:
ఈ రాశివారికి కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు రావచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇళ్ల మరమ్మతులకు డబ్బు ఖర్చు అయ్యే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలున్నాయి. 

కన్య రాశి:
కుజుడు, శని తిరోగమనం కారణంగా ఈ రాశివారు చాలా రకాల దుష్ప్రభావాలకు గురవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మీ సన్నిహితులు, బంధువులతో విభేదాలు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా కుటుంబ కలహాలకు దారి తీసే ఛాన్స్‌ కూడా ఉంది. 

వృశ్చిక రాశి:
ఈ రాశివారికి కుజుడి సంచారం కారణంగా ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయని జతిష్య శాస్త్ర  నిపుణులు తెలుపుతున్నారు. మానసిక సమస్యలు కూడా రావచ్చుని నిపుణులు చెబుతున్నారు.

Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News