Tirumala: ఆన్‌లైన్‌లో ‘వైకుంఠ ద్వార దర్శనం’ టికెట్లు 

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి వైకుంఠ ద్వార (vaikunta dwara darshanam) ప్రత్యేక దర్శనం టికెట్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

Last Updated : Dec 11, 2020, 11:05 AM IST
  • తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ శుక్రవారం ప్రారంభమైంది.
  • ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి వైకుంఠ ద్వార (vaikunta dwara darshanam) ప్రత్యేక దర్శనం టికెట్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
Tirumala: ఆన్‌లైన్‌లో ‘వైకుంఠ ద్వార దర్శనం’ టికెట్లు 

TTD Vaikunda Ekadasi Online Tickets released: తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి వైకుంఠ ద్వార (vaikunta dwara darshanam) ప్రత్యేక దర్శనం టికెట్లు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఏడాది భక్తులకు పది రోజులపాటు.. రోజుకు 20వేల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పించనున్నారు. 

ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు వైకుంఠ ద్వారం నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు. ఈ మేరకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ప్రతిరోజూ 20 వేల టికెట్ల చోప్పున ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.  Also read: Nani ‘శ్యామ్ ‌సింగరాయ్’ షురూ

డిసెంబ‌ర్‌ 25న వైకుంఠ ఏకాద‌శి (Vaikuntha Ekadashi) రోజున ఏపీ ( Andhra Pradesh ) చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆల‌యంలో వైకుంఠ ద్వారాన్ని తెరవనున్నారు. ఆరోజు నుంచి ప‌ది రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి ద‌ర్శనభాగ్యాన్ని కల్పించనున్నారు. Also read: Tamannaah: లిప్‌లాక్.. ఆ హీరోతో అయితే ఓకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News