Vastu Tips for Home : చాలామంది తమ ఇళ్లల్లో అలంకరణ కోసం కృత్రిమ పూలను ఉపయోగిస్తుంటారు. సహజమైన పూలైతే త్వరగా వాడిపోతాయి కాబట్టి అలంకరణ కోసం కృత్రిమ పూలనే ఎక్కువగా వాడుతారు. అయితే ఇలా కృత్రిమ పూలను ఇంట్లో ఉంచుకోవడం వాస్తు ప్రకారం సరైనదేనా.. దీనివల్ల ఏమైనా నష్టం ఉంటుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కుటుంబంలో దు:ఖం నెలకొంటుంది :
కృత్రిమ పూలు అంటే నకిలీ పూవులు. ఇంట్లో నకిలీ పూలు ఉంటే అశుభమని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీనివల్ల ఇంట్లో అశాంతి నెలకొంటుంది. చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. చిన్న వివాదాలు పెద్దవిగా మారుతాయి.
ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ :
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఏ ఇంట్లోనైతే కృత్రిమ పూలు ఉంటాయో.. ఆ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇది ఆ ఇంట్లోని వ్యక్తులందరినీ ప్రభావితం చేస్తుంది. ఈ కారణంగా ఆ వ్యక్తుల అనుబంధాలతో పాటు ఆర్థిక స్థితిగతులు దిగజారుతాయి.
ఆరోగ్యంపై చెడు ప్రభావం :
కృత్రిమ పూల కారణంగా ఇంట్లో ఏర్పడే నెగటివ్ ఎనర్జీ ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మహిళలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఇంట్లోని వారంతా ఏదొక సమస్యతో బాధపడుతుంటారు.
అన్నివిధాలా అనర్థమే :
వాస్తుశాస్త్రం ప్రకారం.. కృత్రిమ పూలు ఇంట్లో ఉండటం అన్నివిధాలా అనర్థమే. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరుగుతుంది. ఒంటరితనం అలుముకుంటుంది. పరస్పర అనురాగం కరువై శత్రుత్వం దరిచేరుతుంది. కుటుంబంలో సరైన వాతావరణం లేదంటే అది జీవితంపై పెద్ద ప్రభావం చూపుతుంది. కాబట్టి కృత్రిమ పూలు ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదని వాస్తుశాస్త్రం చెబుతోంది.
Also Read: AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్..?
Also Read: GAS PRICE HIKE: సామాన్యులకు మరో షాక్.. 50 రూపాయలు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook