Vastu Tips: మీ బెడ్రూమ్‌లో ఆ ఫోటోలున్నాయా..వెంటనే తొలగించండి, లేకుంటే కష్టాలే

Vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం నుంచి మొదలుకుని..ఇంట్లో ఏ వస్తువులు పెట్టాలి, ఎక్కడ పెట్టాలనేది వాస్తులో వివరణ ఉంది. ఇంట్లో కొన్ని వస్తువులుంచడంపై వాస్తుశాస్త్రంలో నిషేధం ఉంది. ఆ వస్తువులేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 11, 2022, 10:25 PM IST
Vastu Tips: మీ బెడ్రూమ్‌లో ఆ ఫోటోలున్నాయా..వెంటనే తొలగించండి, లేకుంటే కష్టాలే

Vastu Tips: హిందూమతంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం నుంచి మొదలుకుని..ఇంట్లో ఏ వస్తువులు పెట్టాలి, ఎక్కడ పెట్టాలనేది వాస్తులో వివరణ ఉంది. ఇంట్లో కొన్ని వస్తువులుంచడంపై వాస్తుశాస్త్రంలో నిషేధం ఉంది. ఆ వస్తువులేంటో తెలుసుకుందాం..

వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనే ప్రస్తావన ఉంది. అదే సమయంలో ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టకూడదని కూడా వాస్తుశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా బెడ్రూమ్స్‌లో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల..భార్యాభర్తల జీవితంలో విబేధాలు తలెత్తుతాయంటున్నారు జ్యోతిష్య పండితులు. మరోవైపు నెగెటివ్ శక్తి ప్రసరిస్తుంది. భార్యాభర్తల జీవితంలో మాధుర్యం కొనసాగాలంటే..ఎట్టి పరిస్థితుల్లోనూ బెడ్రూమ్‌లో కొన్ని వస్తువులు ఉంచకూడదు. సాధారణంగా అలంకరణలో భాగంగా లేదా...పొరపాటునో ఆ వస్తువుల్ని మనం ఇంట్లో అమర్చుకుంటుంటాం. అందుకే బెడ్రూమ్‌లో ఏ వస్తువులు పెట్టకూడదో పరిశీలిద్దాం..

1. మీ బెడ్రూమ్‌లో సముద్రపు కెరటాలు లేదా నీళ్ల ఫోటో ఉంటే వెంటనే తొలగించాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఎందుకంటే దీనివల్ల భార్యభర్తల మధ్య పరస్పర నమ్మకం తగ్గుతుంది. దాంతోపాటు నీళ్ల ఫోటో అనేది ఆ ఇద్దరి జీవితంలో మూడవ వ్యక్తి ప్రవేశించే సంకేతాలిస్తుంది.

2. మీ బెడ్రూమ్‌లో మహాభారత్ లేదా తాజ్‌మహల్ ఫోటో ఉన్నా సరే వెంటనే తొలగించాలి. దీనివల్ల ఇంట్లోనే కాకుండా మనస్సులో కూడా నెగెటివిటీని వ్యాపింపజేస్తుంది. 

3. ఒకవేళ మీ ఇంట్లో హింసాత్మక లేదా క్రూర జంతువు లేదా పక్షి ఫోటో ఉంటే..వెంటనే ఆ ఫోటోను మార్చాల్సిందే. ఎందుకంటే దీనివల్ల ఆ వ్యక్తికి ఆగ్రహం ఎక్కువౌతుంది. అంతేకాదు..పావురం లేదా ఇతర పక్షి ఫోటో బెడ్రూమ్‌లో ఉంటే వంశాభివృద్ధిలో కూడా ఆటంకం ఏర్పడుతుంది. 

4. బెడ్రూమ్‌లో పూర్వీకుల ఫోటో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచకూడదు. నిద్రించే చోట పూర్వీకుల ఫోటో ఉండకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది. దీనివల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ప్రసారమౌతుంది. 

Also read: Rakshabandhan 2022: రక్షాబంధన్ నాడు పొరపాటున కూడా ఇలాంటి రాఖీలు కట్టకూడదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News