Vastu Shastra Money Indications: బాగా డబ్బు సంపాదించాలని ఎవరికి మాత్రం ఉండదు. మహాలక్ష్మి అనుగ్రహంతో కొంతమంది అపార సంపద కూడబెడుతారు. సిరి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనిషి ధనవంతుడు కావడానికి ఎంతో కాలం పట్టదు. వాస్తు శాస్త్రంలో.. కొన్ని ధన సంకేతాలు చెప్పబడ్డాయి. ఎవరి జీవితంలోనైతే ఈ సంకేతాలు ఉంటాయో... సమీప భవిష్యత్తులో వారు ధనవంతులవుతారని వాస్తు నిపుణులు చెబుతుంటారు.
వాస్తు శాస్త్రంలో ధన సంకేతాలు :
బల్లులంటే చాలా మందికి భయం ఉంటుంది. కానీ ఇంట్లో 3 బల్లులు కలిసి కనిపిస్తే అది లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం. మూడు బల్లులు కలిసి మీకు కనిపించినట్లయితే భవిష్యత్తులో మీరు ధనవంతులవుతారనే సంకేతంగా అర్థం చేసుకోవాలి.
ఇంట్లో నల్ల చీమలు కనిపించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే అది ధన ప్రవాహానికి సంకేతం. ఆ ఇంట్లో త్వరలోనే ఆర్థిక పురోగతి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతారు.
ఒక పక్షి ఇంటి పైకప్పు, బాల్కనీ లేదా ప్రాంగణంలో గూడు చేస్తే, అది మంచిది. ఇది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది.
పురుషుల కుడి అరచేతిలో దురద, స్త్రీల ఎడమ అరచేతిలో దురద ఐశ్వర్యాన్ని తెస్తుందని నమ్ముతారు. అరచేతిలో దురద సిరి సంపదలు రాబోతున్నాయనే దానికి సంకేతంగా చెబుతారు.
మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊడుస్తూ కనిపిస్తే అది మీకు చాలా శుభప్రదం. త్వరలో మీకు మంచి గుర్తింపుతో పాటు ఆర్థికంగా మేలు జరుగుతుందని అర్థం.
ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఆవు ఎదురవడం, ఆవు దూడకు ఆహారం ఇవ్వడం వంటివి జీవితంలో సంతోషకరమైన మార్పుకు సంకేతం.
కలలో తెల్ల ఏనుగు, తెల్లపాము, కలశం కనిపిస్తే చాలా మంచిది. అలాంటి కల వచ్చినట్లయితే.. ఏ సమయంలోనైనా ఆ వ్యక్తి అదృష్టం మారవచ్చు. ఇలాంటి కలలు ఆ వ్యక్తులను ధనవంతులను చేస్తాయని చెబుతారు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read : Flipkart Offer: శాంసంగ్ బడ్జెట్ ఫోన్.. రూ.13 వేలు విలువ చేసే ఫోన్ కేవలం రూ.175కే... ఆఫర్ రేపే ముగింపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook