Vastu Tips in Telugu: ఇంట్లో ప్రతి వస్తువు వాస్తు ప్రకారం ఉంచుకోవాలని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉంచిన వస్తువులు సరైన ప్లేస్‌లో లేకుంటే ఇంట్లో వాస్తు దోషాలను పెంచుతుంది. దీంతో ఇంట్లో ఆర్థిక కష్టాలు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లోని ప్రతి వస్తువును వాస్తు ప్రకారం ఉంచుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఉంచిన ఫర్నిచర్ కూడా వాస్తుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మీ ఇంట్లో ఫర్నీచర్‌ను ఎలా ఉంచుకోవాలి..? ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలి..? ఈ వాస్తు చిట్కాలు తెలుసుకోండి.
తేలికపాటి ఫర్నిచర్‌ను ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచుకోవాలి. భారీ ఫర్నిచర్‌ను దక్షిణం లేదా పశ్చిమ దిశలో ఉంచుకోవడం ఉత్తమం. ఈ ప్రదేశాలలో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకుం.. మీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది. అలా కాదని మీ ఫర్నిచర్ తప్పు దిశలో ఉంచినట్లయితే.. మీరు డబ్బును కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇదే వాస్తు దోషాలు దుకాణాలకు కూడా వర్తిస్తుంది.
మీ ఇల్లు లేదా కార్యాలయంలో వుడ్ వర్క్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నట్లుయితే.. దక్షిణ లేదా పశ్చిమ దిశ నుంచి ప్రారంభించి ఉత్తరం లేదా తూర్పు దిశలో ముగించండి. ఇలా చేయడం వల్ల వాస్తు శాస్త్రంలో శుభప్రదంగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీసుకు చెక్క ఫర్నీచర్ బదులు స్టీల్ ఫర్నిచర్ వాడటం మంచిది. అంతేకాకుండా ఫర్నిచర్ తయారు చేసేటప్పుడు.. ఫర్నిచర్ అంచులు గుండ్రంగా ఉండాలని, పదునుగా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. పదునైన అంచులు ప్రమాదకరమైనవి అని.. వాస్తు శాస్త్రం ప్రకారం అవి నెగిటివ్ ఎనర్జీని విడుదల చేస్తాయని అంటున్నారు
ఫర్నిచర్‌పై ముదురు రంగు పాలిష్‌కు బదులుగా లేత రంగు పాలిష్‌ని ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఫర్నిచర్‌పై తయారు చేసిన సూర్యుడు, సింహం, చిరుతపులి, నెమలి, గుర్రం, ఎద్దు, ఆవు, ఏనుగు లేదా చేపల ఆకారాల ప్రతిమలను ఉంచుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మంగళ, శని, అమావాస్య రోజుల్లో ఫర్నీచర్, చెక్క వస్తువులు కొనకూడదు. ఈ రోజుల్లో తప్ప మీరు ఎప్పుడైనా ఫర్నిచర్ కొనుగోలు చేయవచ్చు. ఫర్నిచర్ ఏ చెట్టు చెక్కతో తయారు చేశారో కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటి ఫర్నీచర్‌కు పాజిటివ్ ఎనర్జీ ఉన్న చెట్ల చెక్కలను మాత్రమే ఉపయోగించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. రోజ్‌వుడ్, గంధం, వేప, అశోకం, టేకు, సాల్, అర్జునాలను ఉపయోగించుకుంటే శుభ ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు.
(గమనిక: ఇక్కడ అందజేసిన విషయాలు సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. Zee Telugu News దీనిని ధృవీకరించలేదు.)