Mayurshikha Plant: ఈ మొక్క ఇంట్లో నాటితే.. అదృష్టం మీ వెంటే..! సరైన దిశ తెలుసుకోండి

Vastu Tips: వాస్తు శాస్త్రంలో మయూర శిఖ మెుక్క గురించి ప్రస్తావించబడింది. దీనిని ఇంట్లో నాటడం వల్ల మీకు ఎప్పుడూ డబ్బుకు కొరత ఉండదు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2022, 10:05 AM IST
Mayurshikha Plant: ఈ మొక్క ఇంట్లో నాటితే.. అదృష్టం మీ వెంటే..! సరైన దిశ తెలుసుకోండి

Mayurshikha Plant Vastu Tips: చెట్లు, మెుక్కలను నాటడం వల్ల ఇంటికి అందం వస్తుంది. అంతేకాకుండా వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. శ్రావణ మాసం, భాద్రపద మాసం చెట్లు నాటడానికి శుభప్రదమైనవి భావిస్తారు. హిందూమతంలో రావి, తులసి, వట, శమీ, వేప మెుదలైన చెట్లను పవిత్రమైనవిగా భావించి పూజిస్తారు. ఈ కోవలోకి వస్తుంది మయూర శిఖ లేదా పీకాక్ క్రెస్ట్. ఈ మెుక్క (Vastu tips for Mayurshikha Plant) ఇంట్లో నాటడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 

మయూర శిఖ మొక్క ప్రయోజనాలు
>> మయూర శిఖ మొక్క నెమలి పించంలా ఉంటుంది. దీని పూలు ఊదా రంగులో ఉంటాయి.  ఈ మెుక్కను ఇంట్లో నాటితో మీకు ఎప్పుడు డబ్బుకు లోటు ఉండదు. 
>> వాస్తు ప్రకారం, ఈ మొక్క ఇంటి వాస్తు దోషాలను తొలగించడానికి చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. దీనిని ఇంట్లో నాటితే అందంతోపాటు ఐశ్వర్యం కూడా వస్తుంది. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి...పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.  
>> మీ జాతకంలో పితృ దోషం ఉంటే ఇంటికి ఉత్తర దిశలో ఈ మెుక్కను ఉంచడం శుభప్రదం. ఇది పితృ దోష ప్రభావాలను తగ్గిస్తుందని నమ్ముతారు. తద్వారా కుటుంబంలో సంతోషం ఉంటుంది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
>> వాస్తు ప్రకారం, ఇంటి ముఖద్వారం వద్ద మయూర శిఖ మొక్కను నాటడం ద్వారా దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. ఇంటి సభ్యుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
>> ఈ మొక్కను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. జలుబు, యాసిడ్, కఫం-కొలెస్ట్రాల్, ఆస్ట్రింజెన్సీ, మధుమేహం వంటి వ్యాధుల చికిత్సలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Also Read: Shani Amavasya 2022:ఇవాళే శనిశ్చరి అమావాస్య, శుభ ముహూర్తం, పూజ విధానం తదితర వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News