Shukra Gochar 2022: నిన్న అంటే సెప్టెంబరు 24న ఆనందం, ఐశ్వర్యం, ప్రేమ మరియు అందం ఇచ్చే శుక్రుడు కన్యారాశిలో (Venus Transit in Virgo 2022) సంచరించాడు. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తికి జీవితంలో దేనికీ లోటు ఉండదు. కుండలిలో శుక్రుడు బలహీన లేదా అశుభస్థానంలో ఉంటే ఆ వ్యక్తి అనేక రకాల సమస్యలను ఎదుర్కోంటాడు. ఆరోగ్యంతోపాటు ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది.
బలహీన శుక్రుడి లక్షణాలు..
>> జాతకంలో శుక్ర గ్రహం బలహీనంగా ఉన్న వ్యక్తి లగ్జరీ లైఫ్ ను కోల్పోతాడు. అతడికి సంతోషం ఉండదు.
>> శుక్రుడు బలహీనంగా ఉన్న వ్యక్తులు మతం మరియు ఆధ్యాత్మికత విషయాలవైపు దృష్టి సారిస్తారు. మిగతా వాటిని పెద్దగా పట్టించుకోరు.
>> జాతకంలో శుక్రుడు అశుభ స్థానంలో ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారాల్లో అడ్డంకులు ఎదురువుతాయి.
>> కుండలిలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉండదు. వారికి సంతానం కలుగరు.
శుక్రుని బలపరిచే పరిహారాలు
>>జాతకంలో శుక్రుడి ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి, శుక్రవారం రోజు ఉపవాసం ఉండి లక్ష్మీ దేవిని పూజించండి. దీని కారణంగా బలహీనమైన శుక్రుడు మీ డబ్బు మరియు వ్యాపారాన్ని ప్రభావితం చేయడు. దీంతోపాటు మీరు వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు.
>>శుక్రవారం తెల్లటి రంగు దుస్తులు ధరించి, స్ఫటికాల హారంతో "ఓం ద్రం డ్రిన్ ద్రౌన్ స: శుక్రే నమః" అనే మంత్రాన్ని జపించండి. దీంతో మీ జాతకంలో శుక్రుడు బలపడతాడు. ప్రతిరోజూ కనీసం 108 సార్లు "ఓం శుక్రాయై నమః" అని జపించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
>>మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, శుక్రవారం నాడు ఇల్లు లేదా షాపులో శుక్ర యంత్రాన్ని పఠిష్టంచండి. తెల్లటి పూలతో నిత్యం పూజించడం వల్ల శుక్ర గ్రహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
>>వారంలో ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి... పాలు, ముత్యాలు, పెరుగు, పంచదార, పిండి, నెయ్యి మొదలైన తెల్లటి వస్తువులను దానం చేయండి.
>>శుక్రుడిని బలపరచడానికి ప్రతిరోజూ ఉదయం ఆవుకు రోటీని తినిపించండి. అలాగే, స్త్రీలను గౌరవంగా చూసుకోండి మరియు ఇంట్లోని మహిళలను ఎప్పుడూ అవమానించకండి.
Also Read: Mahalaya Amavasya 2022: ఇవాళే పితృ పక్షం చివరి రోజు, పొరపాటున కూడా ఈ పని చేయకండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Pitru Paksha End Date 2022Sarva Pitru Amavasya 2022 Pitru Paksha 2022