Venus Transit 2023: ఈ రాశులవారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో లగ్జరీ జీవితాలు ప్రారంభం..

Venus Transit 2023: శుక్ర గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం చూపబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ అనుగ్రహం కారణంగా కింది రాశులవారు ఆర్థికంగా లాభాలు పొందుతారు. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా చాలా రకాల మార్పులు వస్తాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2023, 10:35 AM IST
Venus Transit 2023: ఈ రాశులవారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో లగ్జరీ జీవితాలు ప్రారంభం..

 

Venus Transit 2023: శుక్ర గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో ఐశ్వర్యం, భౌతిక సుఖాలు, శృంగారానికి సూచికగా భావిస్తారు. అందుకే ఈ గ్రహానికి శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే అతి త్వరలోనే శుక్రుడు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ శుక్రుడి సంచారం కారణంగా కొన్ని రాశులవారికి లక్ష్మిదేవి అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో 4 రాశులవారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ గ్రహ సంచార ప్రభావం డిసెంబర్‌ నెల చివరి వారం నుంచి ఫ్రిబవరి నెల వరకు ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే లక్ష్మిదేవి అనుగ్రహం వల్ల ఏయే రాశులవారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై లక్ష్మీదేవి అనుగ్ర ప్రభావం:
సింహ రాశి: 

శుక్రుడి సంచారం సింహ రాశివారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు వ్యాపారాల్లో చాలా రకాల మార్పులు వస్తాయి. పిల్లల నుంచి కూడా అనేక శుభవార్తలు వినే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

కన్యా రాశి:
ఈ సంచార ప్రభావం కారణంగా కొత్త కారు లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబం పరంగా అనేక రకాల శుభవార్తలు వింటారు. దీంతో పాటు ఆదాయం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

మకర రాశి:
మకర రాశి వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరు లగ్జరీ జీవితాన్ని గడపడం కారణంగా ఖర్చులు కూడా పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కారణంగా వ్యాపారాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి పురోగతి లభిస్తుంది. వివిధ ప్రదేశాల నుంచి డబ్బును పొందే అవకాశాలు ఉన్నాయి. 

కుంభ రాశి:
శుక్రుని సంచారం వల్ల కుంభ రాశి వారి జీవితంలో కూడా మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో ఆదాయం పెరుగడమే కాకుండా అనేక రకాల మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పిల్లల ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. చదువుపై శ్రద్ధ పెరిగి, ఊహించని ప్రయోజనాలు పొందుతారు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News