Venus Transit 2023: మే 30న కర్కాటక రాశిలోకి శుక్రుడు.. శుక్ర గోచారం.. ఆ 3 రాశులకు వరాలే!

Venus Transit 2023 in Cancer: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో రాశులు మారుతుంటాయి. ఇదే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పరిగణిస్తారు. గ్రహాల రాశి పరివర్తనం ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుుడు పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2023, 04:45 PM IST
Venus Transit 2023: మే 30న కర్కాటక రాశిలోకి శుక్రుడు.. శుక్ర గోచారం.. ఆ 3 రాశులకు వరాలే!

Venus Transit 2023 in Cancer: హిందూ పంచాంగం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం వేర్వేరు రాశులపై వేర్వేరుగా ఉంటుంది. శుక్రగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించనుండటంతో 3 రాశులపై ప్రభావం ఊహించని రీతిలో ఉండనుంది. అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి.

జ్యోతిష్యం ప్రకారం మే 30వ తేదీ శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించనుంది. హిందూ విశ్వాసాల ప్రకారం శుక్రుడిని ధన సంపదలు, వైభవం, ప్రేమ, సౌందర్యానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే శుక్రుడి రాశి పరివర్తనం ప్రభావం మొత్తం 12 రాశులపై స్పష్టంగా పడనుంది. మే 30 నుంచి జూలై 7 వరకూ శుక్రుడు కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఫలితంగా మూడు రాశులపై ఊహించని లాభాలు కలగనున్నాయి. ఈ సమయం చాలా అనువుగా ఉండనుంది. 

మీన రాశి జాతకులపై శుక్రుడి గోచారంతో మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. ప్రేమ జీవితంతో పాటు వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. పొదుపు విషయంలో  చాలా జాగ్ర్తత్తగా ఉటారు. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం. ఊహించని విధంగా డబ్బులు వచ్చి పడటంతో ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో లాభాలుంటాయి.

మేష రాశి జాతకులకు శుక్రుడి గోచారం వరాలు తెచ్చిపెట్టనుంది. ఈ జాతకులకు అంతులేని ధన లాభం కలగనుంది. మీ తోటి ఉద్యోగులు, మీ పై అధికారులు మీ పనిని ప్రశంసిస్తారు. జీవిత భాగస్వామితో మంచి సంబంధాలుంటాయి. ఉద్యోగస్థులకు అనువైన సమయంగా చెప్పవచ్చు. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.

Also Read: Chandra Grahan 2023: ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఎప్పుడు? ఇది ఇండియాలో కనిపిస్తుందా?

శుక్రుడి గోచారం మిధున రాశి జాతకులకు అధ్బుతంగా ఉండనుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. అదృష్టం తోడుగా నిలుస్తుంది. ఊహించని విధంగా ధనలాభం కలగడంతో ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.

Also Read: Weekly Horoscope: రేపటి నుండి ఈ 5 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News