Venus Margi 2023: శుక్రుడి గోచారం, ఈ మూడు రాశులకు సెప్టెంబర్ 4 నుంచి పట్టిందల్లా బంగారమే

Venus Margi 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి.  ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. అదే విధంగా శుక్ర గ్రహాన్ని శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. పూర్తి వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 5, 2023, 02:52 PM IST
Venus Margi 2023: శుక్రుడి గోచారం, ఈ మూడు రాశులకు సెప్టెంబర్ 4 నుంచి పట్టిందల్లా బంగారమే

Venus Margi 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఉన్నా..కొన్ని రాశులపై మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. శుక్రగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశం ప్రభావం ఎలా ఉంటుంది, ఏయే రాశులకు శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం..

హిందూమతంలో శుక్రగ్రహాన్ని వైభవానికి, ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ గ్రహం కర్కాటక రాశిలో పయనించనుండటంతో మూడు రాశుల జాతకులకు కెరీర్‌పరంగా అద్భుతంగా ఉంటుంది. శుక్రుడి కటాక్షం ఉంటే ధన సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు అన్నీ లభిస్తాయి. శుక్రగ్రహం సెప్టెంబర్ 4 అంటే నిన్నటి నుంచి  కర్కాటక రాశిలో పయనిస్తున్నాడు. శుక్రుడి పయనం ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నా..3 రాశులకు మాత్రం గోల్డెన్ డేస్ ప్రారంభమని చెప్పవచ్చు. ఈ మూడు రాశులకు కెరీర్‌లో వృద్ధి ఉంటుంది. ఊహించని ధన సంపద ప్రాప్తిస్తుంది.

కన్యా రాశి జాతకులకు శుక్రుడి కర్కాటక రాశి గోచారంతో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. జీవితంలో ముందుకెళ్లేలా అభివృద్ధి సాధిస్తారు.  సుఖ సంతోషాలుంటాయి. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకోవడంతో ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. అదృష్టం పూర్తిగా తోడవడంతో అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. 

శుక్ర గ్రహం కర్కాటక రాశి గోచారం కారణంగా తులా రాశి జాతకులకు ఆదాయం భారీగా పెరుగుతుంది. వ్యాపారులకు ఊహించని లాభాలుంటాయి. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ప్రైమ జీవితం చాలా సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఉంటాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించాలంటే ఇదే అనువైన సమయం.

శుక్రుడి గోచారంతో  మిధున రాశి జాతకులకు ఆర్ధిక పరిస్థితి చాలా పటిష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి జాతకులు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. పూర్వీకుల సంపద లభించడంతో అనూహ్య లాభాలుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Also read: Mercury Impact: బుధ మహాదశ ప్రారంభమైతే 17 ఏళ్ల పాటు తిరుగుండదిక, అంతా కనకవర్షమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News