Shukra Gochar 2023: అరుదైన యోగం చేయబోతున్న శుక్రుడు.. ఏప్రిల్ 6 నుండి ఈ రాశులకు అదృష్టం..

Shukra Gochar 2023: లగ్జరీ లైఫ్ కు కారకుడైన శుక్రుడు వచ్చే నెలలో మాళవ్య రాజయోగం సృష్టించనున్నాడు. దీని వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2023, 02:20 PM IST
Shukra Gochar 2023: అరుదైన యోగం చేయబోతున్న శుక్రుడు.. ఏప్రిల్ 6 నుండి ఈ రాశులకు అదృష్టం..

Shukra Gochar 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని గ్రహాలు ప్రత్యేక పరిస్థితుల్లో రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. రాజయోగం అంటే ఈ కాలంలో వ్యక్తి అన్ని శుభ ఫలితాలనే పొందుతాడు. జాతకంలో ఈ యోగం ఉన్నారు రాజులాగా బతుకుతారు. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఏప్రిల్ 6న తన స్వంత రాశి అయిన వృషభరాశిలో సంచరించబోతున్నాడు. దీని వల్ల కొన్ని రాశులకు మాళవ్య రాజయోగం ఏర్పడబోతోంది. శుక్రుని సంచారం ఈ రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మాళవ్య రాజయోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.

మాళవ్య రాజయోగం ఈ రాశులకు వరం
వృషభం
శుక్రుడు మీ రాశిలోని లగ్న గృహంలో సంచరించబోతున్నాడు. దీంతో మీకు అదృష్టం కలిసి రానుంది. మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 
సింహరాశి 
మీ రాశి యెుక్క పదవ స్థానంలో మాళవ్య రాజయోగం ఏర్పడుతోంది. మీకు భారీ ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది.  మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ఆస్తి లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. 
కుంభ రాశి
మాళవ్య రాజయోగం మీ రాశి యెుక్క నాలుగో ఇంట్లో ఏర్పడుతోంది. మీరు కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు విలాసాల కోసం భారీగా ఖర్చు చేస్తారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యులతో మీరు మంచి సమయాన్ని గడుపుతారు.

Also Read: Surya Gochar 2023: ఏప్రిల్ లో ఒకే రాశిలో కలవబోతున్న రాజు-యువరాజు.. ఈ 5 రాశులవారికి జాక్ పాట్ పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News