Vipreet Rajyoga in 2023: కొత్త సంవత్సరంలో అందరూ ఎంతో ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఉద్యోగాలపరంగా ముఖ్యంగా వ్యాపారాలపరంగా చాలా రకాల మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా చాలామంది ప్రయోజనాలు పొందుతారు. అయితే ఇదే క్రమంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా రాశులు తిరోగమనం, సంచారాలు చేయబోతున్నాయి. 2023 కొత్త సంవత్సరంలో గ్రహాల పరిస్థితిలో ప్రత్యేక మార్పు రాబోతోంది. ముఖ్యంగా జనవరి 17న శని గ్రహం సంచారం కూడా జరగబోతోంది. ఈ గ్రహం కుంభరాశిలోకి సంచారం చేయడంతో అన్ని రాశుల వారి జీవితాలు మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రాశుల వారికి రాజయోగ గడియలు కూడా రాబోతున్నాయి. విప్రిత్ రాజ్యయోగం వల్ల ఏయే రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయే ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రయోజనాలు పొందేది ఈ రాశుల వారేనా..?:
ధనుస్సు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2023 కొత్త సంవత్సరంలో ధనుస్సు రాశిపై గ్రహ సంచారాల ప్రభావం తీవ్రంగా పడబోతోంది. శని గ్రహం సంచారం చేయడం వల్ల ఏర్పడిన రాజయోగం కారణంగా ఈ రాశు వారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిపై ఇతరులకు నమ్మకం కలుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో రాణించి మంచి ఫలితాలు పొందుతారు.
వృషభం:
శని గ్రహం జనవరి 17 న కుంభరాశిలోకి సంచారం చేయడం వల్ల ఏర్పడే రాజయోగం వల్ల ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు. అంతేకాకుండా విజయాలు సాధించడమే కాకుండా చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు విదేశీ పర్యటనల కారణంగా ఊహించని ప్రయోజనాలు పొందుతారు. ఇక వ్యాపారాల విషయానికొస్తే ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు.
తులారాశి:
తులా రాశి వారికి ఈ సంచారం ఐదవ స్థానంలో ఉండబోతోంది. దీని కారణంగా వీరు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ప్రేమ జీవితంలో ఆనందాన్ని పొందుతారు. అంతేకాకుండా ఏదైనా ఊహించని శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. ఈ సంచారం వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ప్రత్యేకంగా ఉండబోతోంది. అయితే కొత్త సంవత్సరంలో ఈ రాశి వారు ఆర్థికంగా కూడా లాభాలు పొందబోతున్నారు. కాబట్టి ఈ క్రమంలో తులా రాశి వారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read : Dhamaka Twitter Review : ధమాకా ట్విట్టర్ రివ్యూ.. అవుట్ డేటెడ్ స్టోరీ కానీ!
Also Read : 18 Pages Movie Twitter Review: 18 పేజెస్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా హిట్టా, ఫట్టా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook