Tortoise Ring Benefits: తాబేలు ఉంగరం ఈ వేలికి పెట్టుకుంటే ఎవ్వరైనా ధనవంతులవుతారట..

Tortoise Ring Benefits: జ్యోతిష్యంలో తాబేలు ఎప్పుడూ శుభప్రదమే. ఈ ఉంగరం చాలామంది పెట్టుకుండటం మనం చూసే ఉంటాం. జోతిష్యం ప్రకారం తాబేలు ఉంగరం ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటి ప్రకారం ధరిస్తే మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.   

Written by - Renuka Godugu | Last Updated : Jan 31, 2024, 11:52 AM IST
Tortoise Ring Benefits: తాబేలు ఉంగరం ఈ వేలికి పెట్టుకుంటే ఎవ్వరైనా ధనవంతులవుతారట..

Tortoise Ring Benefits: జ్యోతిష్యంలో తాబేలు ఎప్పుడూ శుభప్రదమే. ఈ ఉంగరం చాలామంది పెట్టుకుండటం మనం చూసే ఉంటాం. జోతిష్యం ప్రకారం తాబేలు ఉంగరం ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటి ప్రకారం ధరిస్తే మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. 

మిమ్మల్ని ఆర్థిక సమస్యలు చుట్టుముడితే వాస్తు నియమాల ప్రకారం తాబేలు ఉంగరాన్ని ధరించండి. ఫెంగ్ షుయ్ వాస్తులో కూడా దీనికి గురించి ప్రస్తావన ఉంది. తాబేలు ఉంగరం మాత్రమే కాదు తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంటికి ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఆ ఇంట్లోవారు సంతోషకరమైన జీవితం సాగిస్తారని నిపుణులు చెబుతారు. ముఖ్యంగా తాబేలు ఉంగరం ధరించిన వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని నమ్ముతారు. ఎందుకంటే తాబేలు విష్ణువు రెండో అవతారం అయిన కూర్మావతారం.

సాధారణంగా తాబేలు ఉంగరం మంచితనానికి ప్రతీక. దీన్ని సరైన నియమాల ప్రకారం ధరించాలి. లేకపోతే అది అశుభాన్ని తీసుకువస్తుంది. ముఖ్యంగా తాబేలు ఉంగరం ధరించేటప్పుడు కొన్ని నియమాలు గుర్తుంచుకోవాలి. దీనిప్రకారం ధరిస్తే మీకు ధన సమస్యలు ఉండవు.

ముఖ్యంగా ఈ తాబేలు ఉంగరాన్ని కేవలం శుక్రవారమే కొనుగోలు చేయాలి. అంతేకాదు ఈ ఉంగరాన్ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చిన తర్వాత కొన్ని గంటలపాటు పాలలో లేదా గంగాజలంలో ఉంచడం మంచిది. ఉంగరాన్ని శుభ్రం చేసిన తర్వాత దానిని లక్ష్మీదేవి వద్ద పెట్టి పూజించాలి. గురువారం లేదా శుక్రవారం ఈ ఉంగరాన్ని ధరించడం శుభప్రదం అని నమ్ముతారు.

తాబేలు ఉంగరాన్ని ధరించడానికి చూపుడు లేదా మధ్య వేలు ఈ రెండిటిలో ఏదైనా ఒకదానికి పెట్టుకోవాలి. ఈ ఉంగరం తాబేలు తల మీవైపుగా ఉండేలా చూసుకోవాలి. వెండితో చేసిన తాబేలు ఉంగరాన్ని ధరించడం పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగిస్తుంది. మీ చుట్టూ సానుకూల శక్తిని ఉంచండి.

ఉంగరం ధరించడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగి శాంతి చేకూరుతుంది. ఈ విధంగా మీరు జీవితంలో మీరు కోరుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. ఈ ఉంగరాన్ని ధరిస్తే ఐశ్వర్యంకలుగుతాయి.ఇంట్లో వాస్తు, జీవితంలో శాంతి ఉంటుంది. వీలైతే జ్యోతిష్యుని సలహా తీసుకున్న తర్వాత జాతకం ప్రకారం ఈ ఉంగరాన్ని ధరించడం ఉత్తమం. Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ఇదీ చదవండి: Dream Meaning: మీకు కలలో నల్లకుక్క కరిచిందా? అయితే, ఏం జరుగుతుందో తెలుసా?

ఇదీ చదవండి: Laughing Buddha: లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఈ దిక్కున పెడితే ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News