Prabhas: సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ భారీ విరాళం-వరద బాధితులను ఆదుకునేందుకు

Prabhas donates Rs.1Cr to AP CM relief fund: ఇటీవలి వర్షాలు, వరదలకు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ భారీ విరాళాలు ప్రకటించగా... తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 12:43 PM IST
  • ఏపీ వరద బాధితులకు ప్రభాస్ తనవంతు ఆర్థిక సాయం
  • సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళం
  • ప్రభాస్ ఆర్థిక సాయంపై అభిమానుల హర్షం
 Prabhas: సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ భారీ విరాళం-వరద బాధితులను ఆదుకునేందుకు

Prabhas donates Rs.1Cr to AP CM relief fund: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు (AP Flood Victims) తాజాగా రూ.1 కోటి ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు (CM Releif fund)ఆ విరాళాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో హైదరాబాద్ వరదల సమయంలోనూ, కరోనా సమయంలోనూ ప్రభాస్ భారీ విరాళం అందించిన సంగతి తెలిసిందే. తాజాగా వరద బాధితుల కోసం ప్రభాస్ అందించిన సాయంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వరద బాధితులను (AP Floods) ఆదుకునేందుకు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), జూనియర్ ఎన్టీఆర్ రూ.25లక్షలు చొప్పున విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. విపత్తు చర్యల కోసం టాలీవుడ్ స్టార్స్ తమవంతు ఆర్థిక సాయం అందించడంపై హర్షం వ్యక్తమవుతోంది. మున్ముందు మరింత మంది హీరోలు, నటీనటులు ఆర్థిక సాయం ప్రకటించే అవకాశం ఉంది.

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదలు కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పెను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లి చాలా గ్రామాలు ముంచెత్తాయి. దీంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. వందల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. పలుచోట్ల వంతెనలు కుంగిపోయి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. వరదల (AP Floods) కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 మంది మృత్యువాత పడ్డారు. భారీ ఆస్తి నష్టం సంభవించింది. ప్రభుత్వ సహాయక చర్యలతో వరద బీభత్సం నుంచి ఆ జిల్లాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. 

Also Read: Rape:17 మంది పదో తరగతి విద్యార్థినులపై రేప్-ఎగ్జామ్ పేరిట రాత్రిపూట స్కూల్లో ఉంచి..

Trending News