Dream Meaning: కలలో ఆవును చూడటం చాలా శుభప్రదం.. ఈ రంగు ఆవు కనిపిస్తే జాగ్రత్త..

Dream Meaning: ప్రతిరోజూ రాత్రి పడుకున్నాక ఎన్నో కలలు వస్తాయి. అందులో కొన్ని మనకు గుర్తుంటాయి. కొన్ని మర్చిపోతాం. కలల శాస్త్రం ప్రకారం రాత్రిపూట కలలు భవిష్యత్తులో శుభ లేదా అశుభ సంకేతాలను సూచిస్తాయి. కలలకు చాలా అర్థాలు ఉన్నాయి.

Written by - Renuka Godugu | Last Updated : Feb 10, 2024, 09:22 AM IST
Dream Meaning: కలలో ఆవును చూడటం చాలా శుభప్రదం.. ఈ రంగు ఆవు కనిపిస్తే జాగ్రత్త..

Dream Meaning: ప్రతిరోజూ రాత్రి పడుకున్నాక ఎన్నో కలలు వస్తాయి. అందులో కొన్ని మనకు గుర్తుంటాయి. కొన్ని మర్చిపోతాం. కలల శాస్త్రం ప్రకారం రాత్రిపూట కలలు భవిష్యత్తులో శుభ లేదా అశుభ సంకేతాలను సూచిస్తాయి. కలలకు చాలా అర్థాలు ఉన్నాయి. అయితే, ఈ రోజు మనం కలలో ఆవు కనిపిస్తే ఏం జరుగుతుంది? తెలుసుకుందాం. 

తెల్లని ఆవు..
ఈ కల అర్థం మీరు త్వరలో మంచి ఫలితాలను పొందుతారు. కష్టపడితే ఫలితం ఉంటుంది. స్వప్న శాస్త్రం ప్రకారం తెల్లటి ఆవు కలలో కనిపించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది సంపద, శ్రేయస్సు, ఆనందానికి చిహ్నం. 

ఆవు పాలు తాగడం.. 
స్వప్న శాస్త్రం ప్రకారం మీరు కలలో ఆవు పాలు తాగడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీ అదృష్టం త్వరలో మారుతుందని, మీకు డబ్బు రావచ్చని అర్థం. ఇది ఆరోగ్యం, సంపద, జ్ఞానం పెరుగుదలకు సంకేతం.

ఇదీ చదవండి: Money Vastu Tips: మీరు ధనవంతులు కావాలంటే ఈరోజే ఈ గవ్వలు ఇంటికి తెచ్చుకోండి..!

లేగ దూడ ..
కలలో ఆవు దూడ కనిపించడం కూడా మంచిదని భావిస్తారు. ఈ కల జీవితంలో వచ్చే సంతోషాన్ని సూచిస్తుంది. ఇది పిల్లల నుండి సంతోషం, ఆర్థిక లాభం,ఉద్యోగంలో పదోన్నతికి సంకేతం.

ఆవును చంపడం.. 
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఆవును చంపడం చాలా అశుభం. ఈ కల మీరు భవిష్యత్తులో పాపం చేస్తారని సూచిస్తుంది. అలాగే మీరు జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు.

ఆవుల మంద..
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఆవుల మంద కనిపించడం చాలా శుభసూచకం. ఇది శ్రేయస్సు, సంపద, ఆనందానికి చిహ్నం. ఈ కల అంటే ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. మీరు అకస్మాత్తుగా డబ్బు పొందవచ్చు. 

ఇదీ చదవండి: Kala Sarpa Dosha: జాతకంలో కాల సర్ప దోషమా? తప్పించుకోవడానికి ఇదొక్కటే మార్గం..

నల్లని ఆవు..
నల్ల ఆవు కలలో కనిపించడం అశుభం. ఈ కల దుఃఖం, బాధలు, ఇబ్బందులను సూచిస్తుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News