కామన్వెల్త్ గేమ్స్: జావెలిన్ త్రోలో భారత్‌కు స్వర్ణం.. సత్తా చాటిన నీరజ్

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత తరఫున జావెలిన్ త్రో విభాగంలో పోటీ పడిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఫైనల్ ఈవెంట్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. 

Last Updated : Apr 15, 2018, 06:16 AM IST
కామన్వెల్త్ గేమ్స్: జావెలిన్ త్రోలో భారత్‌కు స్వర్ణం.. సత్తా చాటిన నీరజ్

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత తరఫున జావెలిన్ త్రో విభాగంలో పోటీ పడిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఫైనల్ ఈవెంట్‌లో స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. తద్వారా కామన్వెల్త్ క్రీడల్లో ఈ విభాగంలో పసిడి పతకాన్ని సాధించిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఈ సీజన్‌లో ప్రతీ టోర్నమెంటులో కూడా 80 మీటర్లకు పైగా జావెలిన్ విసిరి రికార్డు సాధించిన నీరజ్, ఈసారి 86.47 మీటర్ల దూరం విసిరి తన కెరీర్ బెస్ట్ రికార్డు నమోదు చేసి పతకాన్ని సాధించాడు. ఇదే విభాగంలో ఆస్ట్రేలియాకి చెందిన హమీష్ పీకాక్ ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకొని రజతం గెలవగా.. గ్రెనెడాకి చెందిన ఆండర్సన్ పీటర్స్ కాంస్యం కైవసం చేసుకున్నాడు. 20 ఏళ్ల నీరజ్ ఇప్పటి వరకూ 85.95 మీటర్ల దూరం జావెలిన్ విసరడాన్నే తన కెరీర్ బెస్ట్‌‌గా పేర్కొన్నాడు. అయితే కామన్వెల్త్‌లో ఆయన రికార్డును ఆయనే బ్రేక్ చేశాడు

 

Trending News