హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణంగా 40 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇండియన్స్ జట్టు బ్యాట్స్‌మెన్‌లో పోలార్డ్ 26 బంతుల్లో 46 పరుగులు (2X4, 4X6 ) రాబట్టి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.
ఆ తర్వాత 137 పరుగుల స్వల్వ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 17.4 ఓవర్లలోనే 96 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారీ తేడాతో సన్‌రైజర్స్ జట్టు భంగపడక తప్పలేదు. ముంబై బౌలర్‌గా బరిలోకి దిగిన వెస్ట్ ఇండీస్ ఆటగాడు అల్జరీ జోసెఫ్ 6 వికెట్లు తీసి సన్‌రైజర్స్ జట్టు నడ్డి విరిచాడు. ఈ మ్యాచ్‌తో ఐపిఎల్ ఆరంగేట్రం చేసిన అల్జరి జోసెఫ్ ఐపిఎల్ టోర్నమెంట్‌లోనే ఒక మ్యాచ్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.