ఇండియా vs ఆసిస్ తొలి వన్డే: ముగిసిన ఆసిస్ బ్యాటింగ్, భారత్ విజయ లక్ష్యం ఎంత ?

ఆస్ట్రేలియాలోని సిడ్ని క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా-ఆసిస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఆసిస్ బ్యాటింగ్ ముగిసింది.

Updated: Jan 12, 2019, 11:58 AM IST
ఇండియా vs ఆసిస్ తొలి వన్డే: ముగిసిన ఆసిస్ బ్యాటింగ్, భారత్ విజయ లక్ష్యం ఎంత ?

ఆస్ట్రేలియాలోని సిడ్ని క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా-ఆసిస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ఆసిస్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసిన ఆతిథ్య జట్టు టీమిండియాకు 289 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. పీటర్ హ్యాండ్స్‌కంబ్ 61 బంతుల్లో 73 పరుగులతో (4X6, 6X2) అంతో ఇంతో రాణించగా ఉస్మాన్ ఖ్వాజా 81 బంతుల్లో 59 పరుగులు (4X6), షౌన్ మార్ష్ 70 బంతుల్లో 54 పరుగులు(4X4) ఆసిస్ జట్టు స్కోర్ పెరగడానికి దోహదపడ్డారు. ఇన్నింగ్స్ చివర్లో మార్కస్ స్టొయినిస్ 43 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.

టీమిండియా నుంచి కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌లకు తలో రెండు వికెట్స్ లభించగా రవీంద్ర జడేజా మరో వికెట్ పడగొట్టాడు.