IND VS BAN Match Highlights: ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో టీమిండియాకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. 6 పరుగుల తేడాతో విజయం

Asia Cup 2023, IND VS BAN Match Highlights: టీమిండియా దూకుడుకి కళ్లెం వేసి బంగ్లాదేష్ షాకిచ్చింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీలో సూపర్ 4 లీగ్ దశలో ఇండియా vs బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు జరిగిన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

Written by - Pavan | Last Updated : Sep 16, 2023, 12:14 AM IST
IND VS BAN Match Highlights: ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో టీమిండియాకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. 6 పరుగుల తేడాతో విజయం

Asia Cup 2023, IND VS BAN Match Highlights: టీమిండియా దూకుడుకి కళ్లెం వేసి బంగ్లాదేష్ షాకిచ్చింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీలో సూపర్ 4 లీగ్ దశలో ఇండియా vs బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు జరిగిన చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ మ్యాచ్‌లో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడి చివరికి బంగ్లాదేశ్ వశమైంది. 

తొలుత టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కి వచ్చిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. అనంతరం 266 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరలో మరొక బంతి మిగిలి ఉండగానే 259 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. 

చివర్లో బ్యాట్ పట్టుకున్న అక్షర్ పటేల్, శార్థుల్ థాకూర్‌లు జట్టును గెలిపిస్తారని అనుకున్నప్పటికీ 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ముజాఫిర్ రెహ్మాన్ బౌలింగ్‌లో హసన్‌కి క్యాచ్ ఇచ్చిన అక్షర్ పటేల్ వెనుతిరిగాడు. ఆ తరువాత వెంటనే 11 పరుగుల స్వల్ప వ్యక్తిగత స్కోర్‌కే శార్ధూల్ థాకూర్ కూడా ముస్తాఫిర్ రెహ్మాన్ బౌలింగ్ లోనే మెహిది హసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తరువాత మహ్మద్ షమీ 6 బంతుల్లో 6 పరుగులు రాబట్టి మరొక బంతి మిగిలి ఉందనగానే తాంజిద్ హసన్ చేతికి చిక్కి రనౌట్ అయ్యాడు. కీలకమైన సమయంలో రెండు బంతులు ఆడిన ప్రసీద్ కృష్ణ ఒక్క పరుగు కూడా తీయకుండానే నాటౌట్‌గా ఆట ముగించాడు. మొత్తానికి టీమిండియా ఓటమి కారణంగా ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ చేసిన వీరోచిత పోరాటం, సెంచరీ ( 133 బంతుల్లో 121 పరుగులు).. రెండూ వృధా అయ్యాయి.

ఇది కూడా చదవండి : Glenn Maxwell: తండ్రైన ఆసీస్ స్టార్ క్రికెటర్...చిన్నారికి టామ్ క్రూజ్ సినిమా పేరు?

ఆసియా కప్ చరిత్రలో 11 ఏళ్ల తరువాత బంగ్లాదేశ్ తొలిసారిగా భారత్ జట్టుపై విజయం సాధించింది. 2012 తరువాత ఆసియా కప్ టోర్నీలో టీమిండియాపై బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఈ నెల 17న ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సి ఉన్న ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచ్ పైనే కేంద్రీకృతమై ఉంది. ఇండియా vs శ్రీలంక జట్ల మధ్య శ్రీలంక సొంత గడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు అనేదే ప్రస్తుతానికి ఉత్కంఠగా మారింది. ఆసియా కప్ 2023 లో గెలిచి అన్ని ఫార్మాట్లలోనూ జయ కేతనం ఎగురవేయాలని టీమిండియా ఉవ్విళ్లూరుతుండగా.. మరోవైపు శ్రీలంక సైతం ఆసియా కప్ గెలవాలన్న పట్టుదలతో ఉంది.

ఇది కూడా చదవండి : PAK Vs SL Highlights: మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్.. ఆసియా కప్ నుంచి పాకిస్థాన్ ఔట్.. చివరి బంతికి శ్రీలంక సంచలన విజయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News