Rohit Sharma slams Australia Players and Media ahead of IND vs AUS 1st Test: భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy 2023) గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (వీసీఏ)లో తొలి టెస్టు రేపు ఉదయం ప్రారంభం అవుతుంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం నాగ్‌పూర్ పిచ్ సిద్దమయింది. భారత జట్టు తమకు అనుకూలంగా స్పిన్ పిచ్‌లను రూపొందించిందని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్స్, ఆటగాళ్లు సోషల్ మీడియాలో వరుస కథనాలను ప్రచురించారు. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫైర్ అయ్యాడు. పిచ్ గురించి ఆలోచించడం మానేసి మ్యాచ్‌పై ఫోకస్ పెట్టండని ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సూచించాడు.
తొలి టెస్టు సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. బుధవారం విలేకరులు నాగ్‌పూర్‌పిచ్ గురించి ప్రశ్నించారు. 'పిచ్‌పై కాకుండా క్రికెట్‌పై దృష్టి పెట్టండి. ఇరు జట్లలోని అందరూ నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. స్పిన్ పిచ్‌లకు తగ్గట్లు ప్రణాళికలను సిద్దం చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది. కొందరు స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో స్పిన్‌ను బాగా ఎదుర్కొంటారు. కొన్నిసార్లు ఎదురు చేయాలి' అని రోహిత్ తెలిపాడు.
'మైదానంలో కెప్టెన్లు విభిన్నమైన ప్రణాళికలను కలిగి ఉంటారు. ఫీల్డ్, బౌలింగ్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంటారు. బ్యాటర్లు ప్రణాళికాబద్ధంగా ఆడాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడానికి నాలుగు మ్యాచ్‌లు ఉన్నాయి. ఆస్ట్రేలియాను ఓడించడం సవాలుతో కూడుకున్నది. గెలవడానికి ఏం చేయాలో, ఎలా ఆడాలనేదానిపై స్పష్టత ఉంది. ఏ మ్యాచ్‌కు అయిన సన్నాహకం ముఖ్యం. ఆస్ట్రేలియాపై ఇదివరకు రెండు సిరీస్‌లు గెలిచాం. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ డ్రా చేసుకున్నాం. మరోసారి ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ గెలిచేందుకు ప్రయత్నిస్తాం' అని రోహిత్ శర్మ చెప్పాడు.
'రిషబ్ పంత్ లేకపోవడం తీరని లోటే. అయితే అతడిని భర్తీ చేయగల ప్లేయర్లు జట్టులో ఉన్నారు. శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడుతున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరు తుది జట్టులో ఉంటారో ఇంకా నిర్ణయించలేదు. మ్యాచ్ రోజే నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్న స్పిన్నర్లు అందరూ క్వాలిటీ ప్లేయర్స్. ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా చాలా మ్యాచ్‌లు కలిసి ఆడారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపించుకున్నారు. ఎవరు తుది జట్టులో ఉండాలనే విషయంపై క్లారిటీ ఉంది' అని రోహిత్ పేర్కొన్నాడు.
Also Read: IND vs AUS: శుభ్‌మన్ గిల్‌కు షాక్.. తెలుగు ఆటగాడికి చోటు! భారత్ తుది జట్టు ఇదే
Also Read: IND vs AUS: ఐసీసీ రంగంలోకి దిగి ఏదైనా చేయాలి.. నాగ్‌పూర్ పిచ్‌పై ఆస్ట్రేలియా అసంతృప్తి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.