Canada Banned Flights: ఇండియా, పాకిస్తాన్ విమానాలు మరో నెల రోజులపాటు నిషేధం

Canada Banned Flights: కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ఇండియా విమానాలపై నిషేధాన్ని మరో నెలరోజుల పాటు పొడిగించింది. ఇండియాతో పాటు పాకిస్తాన్ నుంచి కూడా విమానాల్ని నియంత్రించింది ఆ దేశం. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 23, 2021, 12:43 PM IST
Canada Banned Flights: ఇండియా, పాకిస్తాన్ విమానాలు మరో నెల రోజులపాటు నిషేధం

Canada Banned Flights: కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని ఇండియా విమానాలపై నిషేధాన్ని మరో నెలరోజుల పాటు పొడిగించింది. ఇండియాతో పాటు పాకిస్తాన్ నుంచి కూడా విమానాల్ని నియంత్రించింది ఆ దేశం. 

కరోనా వైరస్ మహమ్మారి(Corona Pandemic)ఉధృతి ఇంకా కొనసాగుతోంది. రోజువారీ కేసుల్లో కాస్త తగ్గుదల ఉన్నా సంక్రమణ మాత్రం ఆగలేదు. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా చాలాదేశాలు ఇప్పటికే ఇండియా నుంచి విమానయానాన్ని రద్దు చేశాయి.కెనడా కూడా ఇప్పటికే ఇండియా నుంచి విమానాల్ని నిషేధించింది(Canada Banned flights). గతంలో అంటే ఏప్రిల్ 22 నుంచి 30 రోజుల పాటు విధించిన నిషేధం ఈ నెల 22వ తేదీతో పూర్తయింది. తాజాగా ఆ నిషేధాన్ని మరో నెలరోజుల పాటు పొడిగిస్తున్నట్టు కెనడా ప్రభుత్వం(Canada government) ప్రకటించింది. జూన్ 21వ తేదీ వరకూ నిషేధం కొనసాగనుందని..అప్పటి వరకూ ఇండియాతో పాటు పాకిస్తాన్ నుంచి కూడా నేరుగా విమానాలుండవని తెలిపింది.

ఈ రెండు దేశాలకు చెందిన ప్రజలు మరో మూడో దేశం మీదుగా తమదేశంలోకి రావచ్చని వెల్లడించింది. అయితే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. అత్యవసరవస్తువులు, వ్యాక్సిన్లు, ఇతర మెడికల్ సంబంధమైనవాటిని రవాణా చేసేందుకు కార్గో ప్లైట్ సర్వీసు ఉంటుందని పేర్కొంది. ప్రజల ప్రాణాల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని..అందుకే నిషేధాన్ని పొడిగించినట్టు ఆ దేశ రవాణా శాఖ మంత్రి ఒమర్ అల్ ఘాబ్రా తెలిపారు. 

Also read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల వేతన సమస్యకు 8వ వేతన సంఘం చెక్ పెడుతుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News