ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో తొలిసారిగా సీజన్ మధ్యలో బ్రేక్ వచ్చింది. గతంలో పరిస్థితులు అనుకూలించిన పక్షంలో విదేశాలలో ఐపీఎల్ సీజన్‌లు ఏ ఆటంకం లేకుండా నిర్వహించారు. కానీ తొలిసారిగా ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. పలువురు మాజీ క్రికెటర్లు, మానవ హక్కుల కార్యకర్తలు ఐపీఎల్ 2021 నిర్వహణపై ఆది నుంచి విమర్శలు చేస్తున్నారు.
ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ రావడం, మైదాన సిబ్బంది, కోచ్‌లకు సైతం కరోనా సోకడంతో ఐపీఎల్ 2021ను నిరవధికంగా వాయిదా వేస్తూ బసీసీఐ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్ సైతం ఐపీఎల్ నిర్వాహకులు, బీసీసీఐని విమర్శించాడు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించడమే అతిపెద్ద తప్పిదంగా అభివర్ణించాడు. ఐపీఎల్(IPL 2021) మధ్యలో ఆపివేయడం తప్పా, వారికి మరో మార్గం దొరకలేదన్నారు.
Also Read: IPL 2021: CSK జట్టులో కరోనా కలకలం, బ్యాటింగ్ కోచ్ Michael Husseyకి కరోనా పాజిటివ్
భారత్‌లో ఏం జరుగుతుంది, కరోనా పరిస్థితుల్లో ఆసుపత్రులకు ఎంతలా క్యూ కడుతున్నారు లాంటివి ఆటగాళ్లకు తెలుసు. టీవీలో వారు భారత్‌లో ఆక్సిజన్ కొరత, బెడ్లు లేకపోవడం లాంటి సమస్యలను కళ్లారా చూశారు. వారు అంత తెలివితక్కువ వాళ్లేం కాదు. ప్రస్తుత పరిస్థితులలో ఐపీఎల్ ఆడటం ఆడటం సరైన నిర్ణయమా, కాదా అనేది ఆటగాళ్లకు స్పష్టంగా తెలుసు. బయట ప్రజలు చనిపోతుంటే క్రికెట్ కొనసాగించడం సరైన నిర్ణయం కాదని తెలుసు. ఈ విషయంలో ఆటగాళ్లను నేను తప్పు పట్టడం లేదంటూ’ డైలీ మెయిల్ కాలమ్‌లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్(Nasser Hussain) తన అభిప్రాయాల్ని బహిర్గతం చేశాడు.
Also Read: IPL 2021 Suspended: ఆటగాళ్లకు కరోనా, ఐపీఎల్ నిరవధిక వాయిదా వేసిన BCCI
గత ఏడాది సైతం భారత్‌లో కరోనా కేసులున్న నేపథ్యంలో యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 ఏ ఆటంకం లేకుండా విజయవంతంగా నిర్వహించారని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గుర్తుచేశాడు. దేశంలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్న సమయంలో భారత్‌లో కరోనా నిర్వహణ అనేది అతిపెద్ద తప్పిదంగా నాసిర్ హుస్సేన్ అభివర్ణించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook