Maxwell Engagement: భారత సంతతి యువతితో మ్యాక్స్‌వెల్ ఎంగేజ్ మెంట్.. ఫొటో వైరల్

భారత సంతతికి చెందిన తన ప్రియురాలు వినీ రామన్‌ను త్వరలో వివాహం చేసుకోబోతున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్. వినీ, మ్యాక్స్ వెల్ గత రెండేళ్ల నుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 27, 2020, 07:18 AM IST
Maxwell Engagement: భారత సంతతి యువతితో మ్యాక్స్‌వెల్ ఎంగేజ్ మెంట్.. ఫొటో వైరల్

ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్ వెల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. భారత సంతతి అమ్మాయి వినీ రామన్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలో తమ వినీతో తన నిశ్చితార్థం జరిగిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్. మెల్‌బోర్న్‌లో నివాసం ఉంటున్న భారత సంతతి యువతి వినీ రామన్, గ్లెన్ మ్యాక్స్ వెల్ గత కొంతకాలం నుంచి గాఢంగా ప్రేమించుకుంటున్నారు.

Also Read: సన్ రైజర్స్ హైదరాబాద్ IPL 2020 షెడ్యూల్.. SRH తొలి మ్యాచ్ ఎవరితో!

Also Read: ఐపీఎల్ 2020 షెడ్యూల్ ఖరారు.. తొలి, చివరి మ్యాచ్ వారిదే!

ప్రియుడురాలు వినీ రామన్ చేతి వేలికి నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తుండగా మ్యాక్స్ వెల్ ఆమెతో కలిసి సెల్ఫీ తీసుకున్నాడు. ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయగా మ్యాక్స్ వెల్ ఎంగేజ్ మెట్ విషయం వైరల్ అవుతోంది. వినీ రామన్ మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా ప్రేమించుకుని, డేటింగ్ చేసిన ఈ జంట త్వరలో వివాహంతో ఒక్కటి కానున్నారు.

Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్ 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

💍

A post shared by Glenn Maxwell (@gmaxi_32) on

2017లో తొలిసారి వినీ రామన్, మ్యాక్స్‌వెల్ కలుసుకున్నట్లు సమాచారం. అనంతరం వీరి పరిచయం ప్రేమగా మారింది. కుటుంబసభ్యులకు తమ ప్రేమ విషయాన్ని చెప్పి పెళ్లికి ఒప్పించిన ఈ జంట ఫిబ్రవరి 26న తమ నిశ్చితార్థం విషయాన్ని తెలిపారు. ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డులు 2019 ఈవెంట్‌కు తన గాళ్ ఫ్రెండ్ వినీతో కలిసి మ్యాక్స్ వెల్ హాజరైన విషయం తెలిసిందే. ఆల్ ది బెస్ట్ మ్యాక్సీ అని ఈ హార్డ్ హిట్టర్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

See photos: భీష్మ సక్సెస్ మీట్‌లో రష్మిక మెరుపులు

See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా  

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News