David Warner: రష్మిక మందన్నకు సారీ చెప్పిన డేవిడ్ వార్నర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

David Warner Rashmika Mandanna Video: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్నకు సారీ చెబుతూ వీడియోను పోస్ట్ చేశాడు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2022, 12:10 PM IST
  • ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసిన డేవిడ్ వార్నర్
  • రష్మిక మందన్నపై వీడియో
  • క్షమాపణలు చెప్పిన ఆసీస్ ఓపెనర్
David Warner: రష్మిక మందన్నకు సారీ చెప్పిన డేవిడ్ వార్నర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

David Warner Rashmika Mandanna Video: క్రీజ్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో.. సోషల్ మీడియాలో కూడా అంతే స్పీడ్‌గా ఉంటాడు ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. ముఖ్యంగా తెలుగు సినిమాలకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తూ సందడి చేస్తుంటాడు. ఆ మధ్య పుష్ఫ సినిమాలో అల్లు అర్జున్‌ను ఇమిటేట్ చేస్తూ చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా చీర కట్టుకుని రష్మిక మందన్న పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియో షేర్ చేశాడు. రష్మికకు సారీ చెబుతూ వీడియోను పోస్ట్ పెట్టాడు. దీనిపై ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి.  

ఇక ఈ వీడియోపై రష్మిక స్పందించలేదు. ఇంతకంటే మంచి లుక్‌లో ఎప్పుడూ చూడలేదంటూ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కామెంట్ చేశాడు. వార్నర్ డిఫరెంట్ లుక్‌లో ఉన్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. భీష్మ సినిమాలోని సాంగ్‌ను వార్నర్ స్పూఫ్ చేశాడు. ఎప్పుడూ హీరోల ముఖాలకు తన ఫేస్ పెట్టే మార్చి వీడియోలు చేసే వార్నర్.. తొలిసారి హీరోయిన్‌ ఫేస్‌ను తన ముఖంగా మార్చి పోస్ట్ చేశాడు. దీంతో  వీడియోను చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.  

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by David Warner (@davidwarner31)

 
ఇక ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్‌లో డేవిడ్ వార్నర్ బ్యాట్‌తో పెద్దగా ఆకట్టులేకపోయాడు. నాలుగు మ్యాచులు ఆడిన వార్నర్.. కేవలం 44 రన్స్ మాత్రమే చేశాడు.మిగిలిన ఆటగాళ్లు కూడా విఫలమవ్వడంతో ఆసీస్ జట్టు గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డేవిల్స్ జట్టుకు వార్నర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ స్టార్ ఓపెనర్ ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే ఆపడం ఎవరి తరం కాదని నెటిజన్లు అంటున్నారు. ఐపీఎల్‌లో వార్నర్ కచ్చితంగా బౌలర్లకు చుక్కలు చూపిస్తాడని చెబుతున్నారు. 

 

Also Read: Iran Police Fire: మెట్రో స్టేషన్‌లో కలకలం.. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు  

Also Read: Chandrababu Naidu: ఇవే నాకు చివరి ఎన్నికలు.. చంద్రబాబు సంచలన ప్రకటన  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x