Chandrababu Naidu Sensational Comments: తనకు ఇవే చివరి ఎన్నికలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించిన చంద్రబాబు.. ప్రజలను ఉద్దేశించి భావోద్వేగంతో ప్రసంగించారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే అని.. లేకపోతే తనకు ఇవే చివరి ఎన్నికలని స్పష్టం చేశారు. అసెంబ్లీలో తనను, తన భార్యను అవమానించారని.. ఇప్పుడు కౌరవసభను గౌరవసభగా మారుస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని.. వీటన్నింటిని తుదముట్టించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పోలీసులను కూడా చంద్రబాబు హెచ్చరించారు. పోలీసు శాఖలో కొందరు చేస్తున్న తప్పుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని.. తప్పులు చేస్తే జగన్ కాపాడలేరని హెచ్చరించారు. రాష్ట్రంలో రోడ్లు వేయలేకున్నా.. మూడు రాజధానులు కడతారా..? అంటూ ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లా అభివృద్ధి ప్రత్యేక శ్రద్ధ పెడతానని హామీ ఇచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఇచ్చేది గోరంత అయితే.. దోచేది కొండంత అంటూ ఆయన ఆరోపించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు.
తనను అడ్డుకోవడానిని పత్తికొండ ఎమ్మెల్యే పేటీఎం బ్యాచ్‌ను పంపించారంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు. కోడి గుడ్లు, రాళ్లు విసిరితే భయపడనని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పథకాలు ఆపేస్తారని ప్రచారం జరుగుతోందని.. తాను వస్తే పథకాలు కట్ చేయనని హామీ ఇచ్చారు. నవరత్నాల పథకాలు పెద్ద మోసం అని ఆయన విమర్శించారు.
మరోవైపు తనకు ఇవే చివరి ఎన్నికలంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే ఆయన నిజంగానే రాజకీయాలకు గుడ్ బై చెబుతారా..? అని అడుగుతున్నారు. ఎప్పుడు ఇంత ఆవేశంగా ప్రకటన చేయని చంద్రబాబు.. ఉన్నట్టుండి సింపతీని ఎందుకు తెరపైకి తీసుకువచ్చారనే చర్చ జరుగుతోంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక్క అవకాశం ఇవ్వాలని అడగ్గా.. చంద్రబాబు కూడా తనకు అవకాశం ఇవ్వకపోతే ఇవే చివరి ఎన్నికలంటూ వ్యాఖ్యనించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు క్లీన్ స్వీప్ దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రణాళిక రచిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఏపీలో ఇప్పటి నుంచే హీట్ మొదలైంది.
Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి
Also Read: Prince OTT: 'ప్రిన్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి