ENG vs IND: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన సామ్‌ బిల్లింగ్స్‌.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే!

ENG vs IND, Sam Billings takes one-handed stunner sends back Shreyas Iyer. ఇంగ్లండ్‌, భారత్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్టులో వికెట్ కీపర్ సామ్‌ బిల్లింగ్స్‌ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 2, 2022, 11:42 AM IST
  • ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన బిల్లింగ్స్‌
  • వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే
  • 11 బంతుల్లో 15 పరుగులు
ENG vs IND: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన సామ్‌ బిల్లింగ్స్‌.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే!

Sam Billings Takes a one-handed catch to dismiss Shreyas Iyer: క్రికెట్‌ ఆటలో అప్పుడప్పుడు ఆటగాళ్లు తమ ఫీల్డింగ్ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. ఒక్కోసారి ఎవరూ ఊహించని రీతిలో క్యాచ్ అందుకుని అందరిని ఆశ్చర్యపరుస్తారు. మైదానంలో పరుగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్ అందుకోవడం, బౌండరీ లైన్‌ వద్ద డైవ్ చేస్తూ బంతిని అందుకుంటారు. ఇలాంటివి ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లను మనం ఇప్పటికే చూసాం. తాజాగా అంతకు మించిన క్యాచ్ నమోదైంది. ఇంగ్లండ్‌, భారత్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ టెస్టులో వికెట్ కీపర్ సామ్‌ బిల్లింగ్స్‌ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. 

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా యువ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు దిగిన అయ్యర్ 11 బంతుల్లో 15 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 28వ ఓవర్ ఐదో బంతిని ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్‌​ ఆండర్సన్‌ షార్ట్‌ బంతిగా విసరగా.. అయ్యర్ లెగ్ సైడ్ షాట్ ఆడాడు. బంతి బ్యాట్ అంచున తాకుతూ వికెట్ కీపర్ సామ్‌ బిల్లింగ్స్‌కు దూరంగా వెళుతోంది. ఒక్కసారిగా లెగ్ సైడ్ వైపు గాల్లోకి దూకిన బిల్లింగ్స్‌.. ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. 

సామ్‌ బిల్లింగ్స్‌ అద్భుత క్యాచ్ అందుకోవడంతో శ్రేయస్‌ అయ్యర్‌ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయ్యర్‌ను ఔట్  చేసేందుకు షార్ట్‌ పిచ్ మంత్రం పనిచేయడంతో ఇంగ్లండ్‌ కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. బిల్లింగ్స్‌కు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ఫాన్స్.. 'స్టన్నింగ్‌ క్యాచ్'‌ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 'వాట్ ఏ క్యాచ్', 'సూపర్ ఫీల్డింగ్', అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు ఈ క్యాచ్ వీడియోను మీరూ చూసి ఎంజాయ్ చేయండి. 

 

Also Read: Shani Dev Puja: శని దేవుడి కథలు.. ఆ ఇద్దరంటే భయం.. శనివారం నాడు వారిని పూజిస్తే శని కన్నెత్తి చూడడు  

Also Read: Telangana Survey: తెలంగాణ లేటెస్ట్ సర్వేలో షాకింగ్ రిజల్ట్.. ఆ పార్టీకి మూడో స్థానమే?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News