క్రికెట్.. కరోనాకు ముందు ఆ తర్వాత అనేలా పరిస్థితి తయారైంది. గతంలో బౌలర్లు, లేక ఫీల్డర్లు ఎవరైనా బంతికి లాలాజలం(Saliva) రుద్ది మెరుపు తెచ్చేందుకు చూసేవారు. కానీ ఇప్పుడు రూల్స్ మారాయి. పొరపాటున ఎవరైనా లాలాజలం(ఉమ్మి) రుద్దితే అంపైర్లు వెంటనే ఆ బంతిని శానిటైజ్ చేయాలి. శానిటైజర్‌ను బంతికి రాసి టిష్యూలతో దానిని పరిశుభ్రం చేయడం అన్నమాట. COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు (England VS West Indies 2nd Test)లో నాలుగోరోజు ఆటలో సరిగ్గా ఇలాంటి సీన్ చోటుచేసుకుంది. క్రికెట్ ప్రేమికులకు మాత్రం ఇది చాలా కొత్తగా అనిపించింది. విండీస్ 41వ ఓవర్ సాగుతుండగా ఇంగ్లాండ్ ఓపెనర్ డొమినిక్ సిబ్లీ పొరపాటున బంతికి ఉమ్మి (Dominic Sibley Uses Saliva) రుద్దాడు. విషయాన్ని అంపైర్ మైఖెల్ గాఫ్‌కు తెలపగా ఆయన శానిటైజర్ ఉన్న టిష్యూలతో బంతిని శానిటైజ్ చేయడం గమనార్హం. BCCI: సబా కరీంపై బీసీసీఐ వేటు!
ఐసీసీ తాజా నిబంధనల ప్రకారం.. బంతికి ఎవరు లాలాజలాన్ని అంటించకూడదు. సిబ్లీ బంతికి లాలాజలాన్ని అంటించడంతో అంపైర్ కాసేపు ఆట నిలిపివేసి మరీ బంతిని శానిటైజ్ చేశాడు. ఒకవేళ ఫీల్డింగ్ జట్టు రెండుసార్లకు మించి అలా లాలాజలాన్ని బంతికి రుద్దిన పక్షంలో 5 పరుగులు పెనాల్టీ (కోత) విధిస్తారు. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..