FIFA World Cup 2022: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ నేటి నుంచే.. తొలి మ్యాచ్ లో తలపడనున్న ఖతార్, ఈక్వెడార్‌..

FIFA World Cup 2022: ఫుట్ బాల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సాకర్ పండుగ వచ్చేసింది. మరికొన్ని గంటల్లో ఈ ఫుట్ బాల్ విశ్వ సంగ్రామానికి తెర లేవనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2022, 07:49 AM IST
  • ఫుట్ బాల్ అభిమానులకు ఇక పండగే
  • నేటి నుంచే సాకర్ సమరం ప్రారంభం
  • ఖతార్ వేదికగా నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు మ్యాచులు
FIFA World Cup 2022: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ నేటి నుంచే.. తొలి మ్యాచ్ లో తలపడనున్న ఖతార్, ఈక్వెడార్‌..

FIFA World Cup 2022:  ఇవాళ ఖతార్‌ వేదికగా ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ప్రారంభంకానుంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది. ఈ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మెుత్తంగా 32 జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ లో అతిథ్య జట్టు ఖతార్‌ ( Qatar).. ఈక్వెడార్‌ను ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9గంటల30 నిమిషాలకు ప్రారంభం కానుంది.  తొలిసారిగా ఖతార్ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌కు అతిథ్యమిస్తోంది. 

అల్‌ బేట్‌ స్టేడియంలో భారత్‌ కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ప్రపంచకప్‌ మ్యాచ్ లను భారత్ లో స్పోర్ట్స్ 18 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అదే విధంగా వూట్ యాప్ డిజిటల్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఈప్రపంచ కప్ కోసం ఖతార్ ఏకంగా 200 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీ మస్కట్ ''లాయిబ్‌’''.  అరబిక్ లో దీని అర్థం ''అద్భుతమైన నైపుణ్యాలున్న ఆటగాడు'' అని. ఈ ప్రపంచకప్‌లో తొలిసారి మహిళా రిఫరీలు కనిపించనున్నారు. 

మెుత్తం టీమ్స్ అన్నింటినీ 8 గ్రూపులుగా విభజించారు. ఒక్కోదాంట్లో నాలుగు జట్లు ఉంటాయి. ప్రతి టీమ్ మిగతా మూడు జట్లుతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది. మెుదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధిస్తాయి. ఈ ప్రపంచకప్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ గా ఫ్రాన్స్ బరిలోకి దిగుతుంది. ఈ సాకర్ టోర్నీలో అందరి చూపు ముగ్గురి ఆటగాళ్లపైనే వారే రొనాల్డో, మెస్సీ, నెయ్‌మార్‌. వీరు తమ జట్ల తరుపున ఏమేరకు రాణిస్తారో వేచి చూడాలి. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో బ్రెజిల్ ఐదు సార్లు గెలుచుకుంది. ఇటలీ, జర్మనీ చెరో నాలుగు సార్లు కప్ ను గెలుచుకున్నాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ప్రపంచకప్‌ 1930లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 21 ప్రపంచకప్‌లు జరిగాయి.

ఏ గ్రూప్‌లో ఎవరెవరు ఉన్నారంటే..
గ్రూప్‌-ఎ: ఖతర్‌, ఈక్వెడార్‌, నెదర్లాండ్స్‌, సెనెగల్‌
గ్రూప్‌-బి: ఇంగ్లండ్‌, ఇరాన్‌, అమెరికా, స్కాట్లాండ్‌/వేల్స్‌/ఉక్రెయిన్‌
గ్రూప్‌-సి: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్‌
గ్రూప్‌-డి: ఫ్రాన్స్‌, డెన్మార్క్‌, ట్యునిషియా, యూఏఈ/ఆస్ట్రేలియా/పెరూ
గ్రూప్‌-ఇ: స్పెయిన్‌, జర్మనీ, జపాన్‌, కోస్టారికా/న్యూజిలాండ్‌
గ్రూప్‌-ఎఫ్‌: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా
గ్రూప్‌-జి: బ్రెజిల్‌, సెర్బియా, స్విట్జర్లాండ్‌, కామెరూన్‌
గ్రూప్‌-హెచ్‌: పోర్చుగల్‌, ఘనా, ఉరుగ్వే, కొరియా

Also Read: Manika Batra: చరిత్ర సృష్టించిన మనిక బాత్రా.. ఆసియా కప్‌లో తొలి మెడల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News