Christiano Ronaldo: విషాదం... రొనాల్డో దంపతులకు పుట్టిన కవలల్లో ఒకరి మృతి..

Christiano Ronaldo's Son Death: ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఇంట విషాదం నెలకొంది. రొనాల్డో దంపతులకు పుట్టిన కవలల్లో ఒకరు మృతి చెందారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2022, 09:18 AM IST
  • క్రిస్టియానో రొనాల్డో ఇంట విషాదం
  • అప్పుడే పుట్టిన కవలల్లో ఒకరి మృతి
  • కొడుకు చనిపోయాడని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన రొనాల్డో
Christiano Ronaldo: విషాదం... రొనాల్డో దంపతులకు పుట్టిన కవలల్లో ఒకరి మృతి..

Christiano Ronaldo's Son Death: ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఓ విషాద వార్త చెప్పాడు. తమకు పుట్టిన కవలల్లో పాప మాత్రమే బతికి ఉందని, బాబు చనిపోయాడని రొనాల్డో తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఏ తల్లిదండ్రులకైనా ఇది తట్టుకోలేని బాధ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కష్ట సమయంలో తమ బిడ్డ మాత్రమే కాస్త శక్తిని, సంతోషాన్ని ఇవ్వగలదని పేర్కొన్నాడు. జార్జినాకు ప్రసవం చేసిన వైద్యులు, నర్సులకు కృతజ్ఞతలు తెలిపాడు. కొడుకు మృతితో కుంగిపోయిన తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని అందరికీ విజ్ఞప్తి చేశాడు. 

తమకు కవల పిల్లలు రాబోతున్నారంటూ గతేడాది అక్టోబర్‌లో జార్జినా-రొనాల్డో దంపతులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. స్పానిష్ మోడల్ జార్జినా రొడ్రిగ్‌తో రొనాల్డొ కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఈ దంపతులకు నవంబర్ 12, 2017న కూతురు అలనా మార్టినా జన్మించింది. తాజాగా కవలలు జన్మించగా.. అందులో కొడుకు చనిపోవడం రొనాల్డో దంపతులను విషాదంలో ముంచెత్తింది.

క్రిస్టియానో రొనాల్డోకి ఇప్పటికే ఆరుగురు పిల్లలు ఉన్నారు. జూన్ 17, 2010న రొనాల్డో మొదటిసారి తండ్రి అయ్యాడు. అయితే క్రిస్టియానో జూనియర్‌‌కి జన్మనిచ్చిన తల్లి ఎవరనేది రొనాల్డో సీక్రెట్‌గా ఉంచాడు. ఆ తర్వాత కొన్నేళ్లు రష్యన్ మోడల్ ఇరినాతో రిలేషన్‌షిప్ సాగించాడు. 2015లో ఆమెతో రిలేషన్‌కు బ్రేకప్ చెప్పాడు. జూన్ 8, 2017న అమెరికాలో సరోగసీ ద్వారా ఇద్దరు కవలలకు తండ్రి అయ్యాడు. ఆ తర్వాత నుంచి జార్జినాతో రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నాడు.

Also Read: Jio Airtel: మీరు జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లా.. రూ.300 లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే...

Anakapalli: సర్‌ప్రైజ్ గిఫ్ట్ అంటూ కళ్లు మూసుకోమంది... కత్తితో గొంతులో పొడిచింది.. కాబోయే భర్తపై యువతి దాడి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News