Mohammed Siraj Video: క్రిస్టియానో రొనాల్డోను అనుకరించిన మహమ్మద్‌ సిరాజ్‌, వీడియో వైరల్

Mohammed Siraj: టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ రొనాల్డోను అనుకరించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 10:49 AM IST
Mohammed Siraj Video: క్రిస్టియానో రొనాల్డోను అనుకరించిన మహమ్మద్‌ సిరాజ్‌, వీడియో వైరల్

Mohammed Siraj: వికెట్ తీసిన ఆనందంలో బౌలర్లు తమదైన శైలిలో సంబరాలు చేసుకుంటుంటారు. ఒక్కోసారి వేరే వారిని అనుకరిస్తూ...సెలబ్రేట్ చేసుకుంటారు. సాధారణంగా టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) వికెట్ పడగొట్టినప్పుడు ఔట్‌ సింబల్‌ చూపిస్తూ చేతిని పైకెత్తి పరుగెత్తుతాడు. 

అయితే దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో పీటర్సన్‌ వికెట్‌ తీసిన ఆనందంలో ప్రముఖ ఫుట్‌బాల్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోను (Cristiano Ronaldo) అనుకరిస్తూ సంబరాలు చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో వాన్‌ డెర్ డస్సెన్ వికెట్‌ను తీసినప్పుడూ ఇదే విధంగా చేశాడు. గోల్‌ కొట్టిన ప్రతీసారి రొనాల్డో ఇచ్చే హవభావాలు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటాయి. తాజాగా సిరాజ్‌ కూడా అచ్చంగా రొనాల్డోను దింపేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది. 

Also Read: IND vs SA: ఆసక్తికరంగా ఐదో రోజు.. భారత్ విజయానికి 6 వికెట్లు! దక్షిణాఫ్రికాకు 211 రన్స్!!

సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో (India Vs South Africa) భారత్ విజయం దిశగా వెళ్తుంది. టీమిండియా గెలుపుకు మరో ఆరు వికెట్లు దూరంలో మాత్రమే ఉంది. తొలి ఇన్నింగ్స్ లో 327 పరుగలు చేసిన భారత్ (India)..అతిథ్య జట్టును 197 పరుగులకే ఆలౌట్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగులకే ఆలౌట్ అయిన టీమిండియా..ప్రోటీస్ జట్టు ముందు 305 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దక్షిణాఫ్రికా (South Africa) రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. దాంతో చివరి రోజు దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 211 రన్స్ చేయాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News