లాక్డౌన్ ను ఉల్లంఘించినందుకు భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్‌కు చెన్నై పోలీసులు జరిమానా విధించి కారును స్వాధీనం చేసుకున్నారు.
భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ (Robin Singh) లాక్డౌన్(Lockdown) నిబంధనలను ఉల్లంఘించినందకు చెన్నై పోలీసులు ఆయనకు రూ.500 జరిమానా విధించారు. దీంతోపాటు రాబిన్ సింగ్ కారును సీజ్ చేశారు. కూరగాయలు కొనేందుకు కారులో మార్కెట్‌కు వెళ్లిన క్రమంలో ఆయన లాక్‌డౌన్ రూల్స్ ఉల్లంఘించారు. దీంతో జరిమానా విధించడంతో పాటు కారు సీజ్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి
కరోనా మహమ్మారి(coronavirus) వ్యాప్తి కారణంగా చెన్నై, మరో మూడు జిల్లాల్లో కఠిన లాక్డౌన్ ను జూన్ 30వరకు పొడిగించారు. దీంతో అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి రెండు కిలోమీటర్ల పరిధి మేర వెళ్లడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఈ నిబంధనను మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. Photos: జబర్దస్త్ యాంకర్ అనసూయ హొయలు
అంతకుముందు రిషి ధావన్...
ఈ ఏప్రిల్‌లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నగరంలో కర్ఫ్యూను ఉల్లంఘించినందుకు మరో భారత క్రికెటర్ రిషి ధావన్ (Rishi Dhawan)కు పోలీసులు రూ.500 జరిమానా విధించడం తెలిసిందే. . జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ