Vinod Kambli Controversy: మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు, ఈసారి అతని మీద భార్య ఆండ్రియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా ఫిర్యాదు మేరకు ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంబ్లీ తనను దూషించాడని ఆండ్రియా ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు మద్యం మత్తులో ఆండ్రియా తనను కొట్టాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ముంబై పోలీసులు వెల్లడించి ఐపిసి సెక్షన్ 324 అంటే ప్రమాదకరమైన ఆయుధాలతో స్వచ్ఛందంగా గాయపరచడం, 504 అవమానం కింద కాంబ్లీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
ఇక ఈ విషయంలో సీఆర్పీసీ సెక్షన్ 41A కింద నోటీసులు అందజేయడానికి బాంద్రా పోలీసులు వినోద్ కాంబ్లీ నివాసానికి చేరుకుని పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని, వాంగ్మూలం నమోదు చేయాలని కోరారు. ఇక బాంద్రా పోలీసులు చెబుతున్న దాని ప్రకారం కాంబ్లీ మద్యం మత్తులో తన భార్యను వంట పాన్ హ్యాండిల్‌తో కొట్టాడని ఆరోపణలు వచ్చాయి, అలాగే ఆయన ఆండ్రియాపై వంట పాన్ హ్యాండిల్‌ను విసిరి, ఆమె తలకు గాయమయ్యేట్టు చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. బ్లీ తన బాంద్రా ఫ్లాట్‌కు మద్యం మత్తులో వచ్చి భార్యను దుర్భాషలాడాడు, అయితే దీన్ని కాంబ్లీ 12 ఏళ్ల కుమారుడు గమనించి అతడిని శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు.
కానీ కాంబ్లీ శాంతించలేదు సరికదా వంటగదిలోకి పరిగెత్తి అక్కడి నుంచి పాన్ హ్యాండిల్ తీసుకొచ్చి భార్యపైకి విసిరాడు. ఆమెకు గాయాలు కావడంతో వినోద్ కాంబ్లీ భార్య మొదట భాభా ఆసుపత్రికి వెళ్లిందని చికిత్స తీసుకుని అనంతరం కేసు నమోదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారని చెబుతున్నారు. కాంబ్లీని శాంతింపజేసేందుకు ప్రయత్నించినా కారణం లేకుండా నన్ను, మా కుమారుడిని దుర్భాషలాడాడని కాంబ్లీ భార్య ఆండ్రియా ఫిర్యాదులో పేర్కొంది. వంట పాన్‌హ్యాండిల్‌తో కొట్టిన తర్వాత, మళ్లీ బ్యాట్‌తో కొట్టాడని, నేను ఆపగలిగాను అనంతరం కొడుకుతో కలిసి ఆస్పత్రికి చేరుకున్నానని ఆమె అన్నారు. 51 ఏళ్ల వినోద్ కాంబ్లీకి వివాదాలేమీ కొత్త కాదు.
కొంతకాలం క్రితం మద్యం తాగి వాహనం నడుపుతూ పతాక శీర్షికలలోకి వచ్చాడు. వినోద్ కాంబ్లీ భారత్ తరఫున 17 టెస్టులు ఆడాడు, అందులో 1084 పరుగులు చేశారు. ఇక కాంబ్లీ భారత్ తరఫున 104 వన్డేల్లో 2477 పరుగులు చేశాడు. అలాగే మొత్తం మీద 129 మ్యాచ్‌ల్లో 9965 పరుగులు చేసిన వినోద్ కాంబ్లీ 2000 సంవత్సరంలో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. కొంతకాలం క్రితం, అతను ఒక ఇంటర్వ్యూలో తన ఉద్యోగం గురించి మాట్లాడుతూ తనకు ఎలాంటి పని లేదని, బీసీసీఐ ఇచ్చే పెన్షన్‌పైనే జీవిస్తున్నానని కాంబ్లీ చెప్పాడు. 1991లో కెరీర్ ప్రారంభించిన కాంబ్లీ కేవలం తొమ్మిదేళ్లకే తన కెరీర్ ముగించాడు. కాంబ్లీ 2000లో తన చివరి మ్యాచ్ ఆడాడు, అతని క్లోజ్ ఫ్రెండ్ అయిన సచిన్ 24 సంవత్సరాలు దేశం కోసం ఆడి అనేక రికార్డులు సృష్టించగా ఆయనతోనే కెరీర్ మొదలు పెట్టిన కాంబ్లే మాత్రం 9 ఏళ్లకే ముగించాడు.
Also Read: Pervez Musharraf: గంగూలీకి ముషారఫ్ ఫోన్.. రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందని వార్నింగ్
Also Read: Cristiano Ronaldo Birthday: ఆ విషయంలో మూడో స్పోర్ట్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో బర్త్ డే స్పెషల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.