Novak Djokovic: గర్జించిన సెర్బియా సింహం.. జకోవిచ్ దెబ్బకు తలవంచిన రికార్డులు

Novak Djokovic vs Casper Ruud Highlights: అత్యధిక గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించిన ఆటగాడిగా సెర్బియా స్టార్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ రికార్డు సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో క్యాస్పర్ రూడ్‌ను 7-6, 6-3, 7-5తో తేడాతో ఓడించి.. 23వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 12, 2023, 07:09 AM IST
Novak Djokovic: గర్జించిన సెర్బియా సింహం.. జకోవిచ్ దెబ్బకు తలవంచిన రికార్డులు

Novak Djokovic vs Casper Ruud Highlights: సెర్బియా వీరుడు నోవాక్ జకోవిచ్ గర్జించాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుని.. అత్యధిక గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆదివారం క్యాస్పర్ రూడ్‌ను వరుస సెట్లలో ఓడించి.. విశ్వవిజేతగా నిలిచాడు. 7-6, 6-3, 7-5తో తేడాతో జకోవిచ్ విజయం సాధించాడు. జకోవిచ్‌కి ఇది 23వ గ్రాండ్‌స్లామ్. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు గెలుచుకున్న స్పెయిన్‌ ఆటగాడు రఫెల్‌ నాదల్ (22)‌ను ఈ సెర్బియా స్టార్ వెనక్కి నెట్టాడు. మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను ముద్దాడాడు. 

నార్వే ఆటగాడు నాలుగో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌తో జకోవిచ్ హోరాహోరీగా తలపడ్డాడు. తొలి సెట్‌లో ఇద్దరు నువ్వా నేనా అన్న రీతిలో పోటీపట్టారు. తొలి సెట్ ఆరంభంలో రూడ్ (4-1) ఆధిక్యంలో దూసుకెళ్లగా.. జకోవిచ్ పుంజుకుని వరుసగా మూడు గేమ్‌లు గెలిచి రూడ్‌ను సమం చేశాడు. ఇద్దరు సర్వీసులను నిలబెట్టుకుంటూ పాయింట్లు సాధించడంతో టైబ్రేకర్‌కు వెళ్లింది. టైబ్రేకర్‌లో జకో జోరు ప్రదర్శించాడు. 7-6 తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు. అదేఊపులో రెండో సెట్‌ను 6-3 తేడాతో ఈజీగా సొంతం చేసుకున్నాడు. 

మూడో సెట్‌లో రూడ్ పోరాడాడు. జకోవిచ్‌కు గట్టి పోటీనిచ్చాడు. ఓ దశలో స్కోరు 5-5తో సమం కావడంతో పోరు ఉత్కంఠభరితంగా సాగింది. అయితే ఇక్కడ జకో మళ్లీ రెచ్చిపోయాడు. రూడ్ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి.. తరువాత తన సర్వీస్‌ నిలబెట్టుకున్నాడు. దీంతో 7-5 తేడాతో మూడో సెట్ గెలవడంతోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మ్యాచ్‌ను గెలిచిన అనంతరం జకోవిచ్ కోర్టులోనే పడుకుండిపోయాడు. అనంతరం లేచి రూడ్‌ను అభినందించాడు. 

 

జకోవిచ్‌కు ఇది మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. గతంలో 2016, 2021 సీజన్స్‌లో విజేతగా నిలిచాడు. 2012, 2014, 2015లో మూడుసార్లు ఫైనల్స్‌కు చేరుకున్నా.. నిరాశే ఎదురైంది. 2020లో మరోసారి రన్నరప్‌గా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో 3 టైటిళ్లతో మాట్స్ విలాండర్, ఇవాన్ లెండిల్, గుస్తావో కుర్టెన్‌లను సమం చేశాడు. ఇప్పటివరకు మొత్తం 34 పురుషుల సింగిల్స్ గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడాడు ఈ సెర్బియా స్టార్. జోకో ఖాతాలో 3 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు, 7 వింబుల్డన్, 3 యూఎస్ ఓపెన్, 10 ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిళ్లు ఉన్నాయి.  

అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన జకోవిచ్‌ను ఇప్పట్లో ఎవరు అధికమించే అవకాశం కనిపించడం లేదు. రోజర్ ఫెదరర్ 20 టైటిళ్ల వద్ద ఆగిపోగా.. రఫెల్ నాదల్ 22 టైటిళ్లు గెలిచాడు. ఫెదరర్ టెన్నిస్‌కు వీడ్కోలు పలకగా.. నాదల్ గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. నాదల్ పూర్తిగా కోలుకుని మరో టైటిల్ గెలుస్తాడనే గ్యారంటీ లేదు. ప్రస్తుతం జోకో ఫామ్‌ను చూస్తే.. మరిన్ని టైటిళ్లు తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తున్నాడు. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించిన ఆటగాడిగా జకోవిచ్ పేరు ఎక్కువగా కాలం నిలిచిపోయే అవకాశం ఉంది. 

Also Read: Jasprit Bumrah Comback: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. బుమ్రా రీఎంట్రీకి రెడీ  

Also Read: Ind VS Aus WTC Final 2023: మ్యాచ్‌ మధ్యలో అమ్మాయికి లిప్ కిస్.. నెట్టింట వీడియో వైరల్   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News