R Ashwin Viral Video: ఏం వాసన చూస్తున్నావ్ అశ్విన్ అన్న.. ఆ జెర్సీ నీదేనా మరి! నవ్వులు పూయిస్తున్న వీడియో

R Ashwin reacts on smelling India Jersey during Zimbabwe Match. టీమిండియా వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌ జెర్సీల వాసన చూస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 8, 2022, 07:24 PM IST
  • ఏం వాసన చూస్తున్నావ్ అశ్విన్ అన్న
  • ఆ జెర్సీ నీదేనా మరి యాష్
  • నవ్వులు పూయిస్తున్న అశ్విన్ వీడియో
R Ashwin Viral Video: ఏం వాసన చూస్తున్నావ్ అశ్విన్ అన్న.. ఆ జెర్సీ నీదేనా మరి! నవ్వులు పూయిస్తున్న వీడియో

R Ashwin Viral Video​, Ravichandran Ashwin smelling India Jersey during Zimbabwe Match: క్రికెట్‌ మ్యాచ్‌లలో అప్పుడపుడు కొన్ని సరదా సంఘటనలు జరుగుతుంతాయి. మైదానంలోని ప్లేయర్స్ లేదా స్టాండ్స్‌లోని ప్రేక్షకులు చేసే కొన్ని పనులు భలే నవ్వులు పూయిస్తాయి. లైవ్ రన్నింగ్ అవుతుంది కాబట్టి.. మైదానంలో ఏది జరిగినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా ఆటగాళ్లకు సంబందించినవి అయితే నిమిషాల్లో ట్రెండింగ్ అవుతాయి. తాజాగా టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు. 

టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్ 12లో భాగంగా ఆదివారం భారత్‌, జింబాబ్వేల మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు టాస్‌ వేస్తుండగా.. అప్పటివరకూ ప్రాక్టీస్‌లో ఉన్న కొందరు ప్లేయర్స్ మైదానం వీడుతున్నారు. ఈ క్రమంలో భారత సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌ కూడా మైదానం వీడేందుకు సిద్దమయ్యాడు. గ్రౌండ్‌లో ఉన్న తన జెర్సీని గుర్తుపట్టేందుకు.. చేతిలో ఉన్న రెండు జెర్సీల వాసన చూశాడు. ఆపై తన జెర్సీని గుర్తుపట్టి.. ఇంకోదాన్ని అక్కడే పడేసి వెళ్లాడు. 

రవిచంద్రన్ అశ్విన్‌ జెర్సీల వాసన చూస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలా మంది పగలపడి నవ్వుకుంటున్నారు. అశ్విన్ ఏం చేస్తున్నాడు, ఏం వాసన చూస్తున్నావ్ అశ్విన్ అన్న, ఆ జెర్సీ నీదేనా, దుస్తులను గుర్తించే అసలైన మార్గం ఇదే అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు. మాజీ ప్లేయర్స్ అభినవ్ ముకుంద్, హర్భజన్ సింగ్ కూడా ఈ వీడియోపై ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈట్వీట్‌ చూసిన ఆర్ అశ్విన్‌ స్పందించాడు. 'ముందుగా జెర్సీ సైజు కోసం చెక్ చేశా. దానిపైన ఏమైనా పేర్లు ఉన్నాయేమో అని చూశా. ఆపై నేను వాడే పెర్‌ఫ్యూమ్ వాసన చూసి జెర్సీ తీసుకున్నా. అరే.. కెమెరామెన్‌' అని యాష్ బదులిచ్చాడు. అంతేకాదు పగలబడి నవ్వుతున్న ఎమోజీలను కూడా జత చేశాడు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Also Read: IND Playing XI vs ENG: కార్తీక్, అక్షర్ ఔట్.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో బరిలోకి దిగే భారత జట్టిదే!  

Also Read: Poonam Bajwa Pics: నాభి అందాలు ఎక్స్‌పోజ్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో మంటలు పుట్టిస్తోన్న పూనమ్ బజ్వా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News