రాజమౌళికి ' ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం '

Last Updated : Sep 18, 2017, 11:57 AM IST
రాజమౌళికి ' ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం '

బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళికి మరో అరుదైన పురస్కారం దక్కింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించదగిన రితిలో బాహుబలి సినిమా తీసి తెలుగు ఖ్యాతిని అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పినందుకు గాను ఆయనకు ఏఎన్ఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన ' ఏఎన్ఆర్ జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో రాజమౌళి ఈ అవార్డు దక్కించుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.

సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తా - రాజమౌళి

ఏఎన్ఆర్ జాతీయ అవార్డును అందుకున్న సందర్భంంలో  దర్శకుడు రాజమౌళి ప్రసంగించారు. ఈ సందర్భంగా  ఆయన మట్లాడుతూ.. ఈ అవార్డుతో పెద్ద బాధత్యను తన భుజాలపై పెట్టారని పేర్కొన్నారు. భవిష్యత్తులో  సమజానికి ఉపయోగపడే మరిన్ని సినిమాలు తీస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ..రాజమౌళి నుంచి తెలుగు ప్రజలు మరిన్ని మంచి సినిమాలు ఆశిస్తున్నారని .. ఈ బాధ్యతను రాజమౌళి సమర్ధవంతంగా నిర్వర్తించగలరని పేర్కొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజ్ మౌళికి సన్మాన పత్రం, చెక్కును అందించారు.

Trending News