ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఇవే..!

ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో కొనసాగుతున్నారు.

Last Updated : Jan 4, 2018, 06:22 PM IST
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఇవే..!

ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో కొనసాగుతున్నారు. అగ్రస్థానాన్ని మాత్రం  న్యూజిలాండ్ క్రికెటర్ కొలిన్ మన్రో 11 స్థానాలు ఎగబాకి కైవసం చేసుకోవడం గమనార్హం. అలాగే బౌలర్లలో మరో న్యూజిలాండ్ ఆటగాడు ఇష్ సోధీ 9 స్థానాలు ఎగబ్రాకి నంబర్ వన్ స్థానాన్ని పొందాడు. 2009, 2010 సంవత్సరాల తర్వాత న్యూజిలాండ్ ఆటగాళ్లు ఇలా టీ20ల్లో అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. ఐసీసీ టీ20 టాప్ టెన్ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న భారత క్రికెటర్లలో కోహ్లీతో పాటు మరో ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ మాత్రమే జాబితాలో ఉన్నారు. ఇక బౌలర్ల జాబితాకు వస్తే భారత బౌలర్ బుమ్రా నాలుగో ర్యాంకులో కొనసాగడం గమనార్హం. 

Trending News