ICC Odi World Cup 2023: రేపటి నుంచే వరల్డ్ కప్ సమరం.. రెండు స్థానాల కోసం 10 జట్లు పోటీ

World Cup Qualifier 2023 Matches: ప్రపంచ కప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. మొత్తం 10 జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు పోటీ పడుతున్నాయి. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు భారత్ వేదికగా జరిగే ప్రపంచకప్‌కు క్వాలిఫై అవుతాయి.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 17, 2023, 07:56 PM IST
ICC Odi World Cup 2023: రేపటి నుంచే వరల్డ్ కప్ సమరం.. రెండు స్థానాల కోసం 10 జట్లు పోటీ

World Cup Qualifier 2023 Matches: ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే టీమిండియా మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్‌ రిలీజ్ అయింది. భారత్ వేదికగా అక్టోబర్-నవంబర్ నెలలో వరల్డ్ కప్ జరగనుంది. మెయిన్‌ మ్యాచ్‌లకు ముందు క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు జింబాబ్వేలో జూన్ 18 నుంచి జూలై 9 వరకు జరుగుతాయి. ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. టాప్-2లో నిలిచిన జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి.   

పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్, నేపాల్, యూఎస్‌ఏ ఉన్నాయి. గ్రూప్ బీలో శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, ఒమన్, యూఏఈ జట్లు ఉన్నాయి. ఇక్కడ గెలిచిన జట్లు భారత్‌లో ప్రపంచకప్‌ ఆడేందుకు రానున్నాయి. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు నేరుగా వరల్డ్ కప్‌కు అర్హత సాధించాయి. 

ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒక మ్యాచ్‌ ఆడనున్నాయి. ప్రతి గ్రూప్‌లోని మొదటి మూడుస్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్‌లో ఎంట్రీ ఇస్తాయి. ఇక్కడ టాప్‌-2లో నిలిచిన జట్లు.. ఫైనల్‌ ఆడడంతోపాటు భారత్‌లో జరిగే ప్రపంచ కప్ 2023కి చేరుకుంటాయి. క్వాలిఫయర్ మ్యాచ్‌లలో తొలిసారిగా సూపర్ సిక్స్ దశ నుంచి జరిగే అన్ని మ్యాచ్‌లకు డీఆర్‌ఎస్‌ను అమలు చేయనున్నారు. ఇప్పటికే అన్ని జట్లు తమ ఆటగాళ్లను ప్రకటించి.. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి.

ఐర్లాండ్ జట్టు: ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), మార్క్ అడైర్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, ఆండీ మెక్‌బ్రైన్, బారీ మెక్‌కార్తీ, పీజే మూర్, పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.

నేపాల్ జట్టు: రోహిత్ పౌడెల్ (కెప్టెన్), కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, జ్ఞానేంద్ర మల్లా, కుశాల్ మల్లా, ఆరిఫ్ షేక్, దీపేందర్ సింగ్ ఐరీ, గుల్సన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ కెసి, సందీప్ లామిచానే, భీమ్ షార్కీ, లలిత్ రాజ్‌బన్షి, ప్రతిష్ జెసి, అర్జున్ సౌద్ మహతో.

నెదర్లాండ్స్: స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఓడౌడ్, లోగాన్ వాన్ బీక్, విక్రమ్ సింగ్, ఆర్యన్ దత్, వివ్ కింగ్మా, బాస్ డి లీడే, నోహ్ క్రోస్, ర్యాన్ క్లైన్, తేజా నిడమనూరు, వెస్లీ బరేసి, షరీజ్ అహ్మద్, క్లేటన్ ఫ్లాయిడ్, మైఖేల్ లీవిట్, సకీబ్ జుల్ఫికర్.

ఒమన్: జీషన్ మక్సూద్ (కెప్టెన్), అకిబ్ ఇలియాస్, జతీందర్ సింగ్, కశ్యప్ ప్రజాపతి, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, సందీప్ గౌడ్, అయాన్ ఖాన్, సూరజ్ కుమార్, అదీల్ షఫీక్, నసీమ్ ఖుషి, బిలాల్ ఖాన్, కలీముల్లా, ఫయాజ్ బట్, జై ఒడెదర, సమయ్ శ్రీవాస్తవ రఫీవుల్లా.

స్కాట్లాండ్: రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, అలస్డైర్ ఎవాన్స్, క్రిస్ గ్రీవ్స్, జాక్ జార్విస్, మైఖేల్ లీస్క్, టామ్ మెక్‌ఇంతోష్, క్రిస్ మెక్‌బ్రైడ్, బ్రాండన్ మెక్‌ముల్లన్, జార్జ్ మున్సే, అడ్రియన్ నీల్, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ తాహిర్, హమ్‌జాన్, హమ్‌జాన్.

శ్రీలంక: దసున్ షనక (కెప్టెన్), కుశాల్ మెండిస్, దిముత్ కరుణరత్నే, పాతుమ్ నిస్సాంక, చరిత్ అస్లంక, ధనంజయ డి సిల్వా, సదీర సమరవిక్రమ, వనిందు హసరంగ, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, కసున్ రజిత, లహిరు కుమార, మ‌హేష్ తీక్షణ, మ‌హేష్ తీక్షణ, మ‌హేష్ తీక్షణం.

యూఏఈ: మహ్మద్ వసీం (కెప్టెన్), ఏతాన్ డిసౌజా, అలీ నసీర్, వృత్య అరవింద్, రమీజ్ షాజాద్, జవదుల్లా, ఆసిఫ్ ఖాన్, రోహన్ ముస్తఫా, అయాన్ ఖాన్, జునైద్ సిద్ధిఖీ, జహూర్ ఖాన్, సంచిత్ శర్మ, ఆర్యాన్ష్ శర్మ, కార్తీక్ మెయ్యప్పన్, బాసిల్ హమీద్.

Also Read: Ambati Rayudu: పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్‌కు అంబటి రాయుడు రెడీ.. అక్కడి నుంచే పోటీ..?  

Also Read: Pawan Kalyan Speech: సీఎం కావడానికి నేను సంసిద్ధం.. తల తెగినా మాటకు కట్టుబడి ఉంటా: పవన్ కళ్యాణ్    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News