పాకిస్తాన్‌తో క్రికెట్‌: బీసీసీఐ ప్రతిపాదనపై స్పందించిన ఐసీసీ!

పాకిస్తాన్‌తో క్రికెట్‌: బీసీసీఐ ప్రతిపాదనపై స్పందించిన ఐసీసీ!

Last Updated : Mar 3, 2019, 11:10 PM IST
పాకిస్తాన్‌తో క్రికెట్‌: బీసీసీఐ ప్రతిపాదనపై స్పందించిన ఐసీసీ!

దుబాయ్: పుల్వామా దాడి నేపథ్యంలో ఉగ్రవాదులకు ఊతమిస్తున్న దేశాలతో క్రీడా ఒప్పందాలు చేసుకోకుండా వాటిపై నిషేధం విధించాలని కోరుతూ పాకిస్తాన్ పేరెత్తకుండానే బీసీసీఐ చేసిన ప్రతిపాదనను ఐసీసీ తోసిపుచ్చింది. ఐసీసీలో సభ్యులుగా వున్న దేశాలపై అలాంటి చర్యలు తీసుకునే అధికారం తమకు లేదని, అసలు అలాంటి విషయాలు తమ పరిధిలోకే రావని ఐసీసీ తేల్చిచెప్పింది. దేశాలపై నిషేధం అనేది ప్రభుత్వాల స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమే తప్ప ఇందులో ఐసీసీకి ఎలాంటి సంబంధం లేదని ఐసీసీ చైర్మన్ స్పష్టం చేశారు. 

ఐసీసీ వరల్డ్‌కప్‌లో భాగంగా జూన్ 16న పాకిస్థాన్‌తో భారత్ క్రికెట్ మ్యాచ్ ఆడాల్సి వుండగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో అసలు ఈ మ్యాచ్ ఆడాలా వద్దా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయంలో క్రీడాకారులు సైతం తమకు తోచిన అభిప్రాయాలు వెల్లడిస్తూ ఎప్పటికప్పుడు ఈ అంశాన్నిసస్పెన్స్‌లో పెడుతున్నారు.

Trending News