ICC Cricket World Cup 2023: ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలి..? లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

World Cup 2023 Live Streaming Details: మరికొన్ని గంటల్లో ప్రపంచకప్ వేట మొదలుకానుంది. విశ్వ కప్ కోసం పది జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగనుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌లను లైవ్‌లో ఎక్కడ చూడాలి..? ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చా..? వివరాలు ఇలా..  

Written by - Ashok Krindinti | Last Updated : Oct 4, 2023, 10:10 PM IST
ICC Cricket World Cup 2023: ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలి..? లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

World Cup 2023 Live Streaminig Details: భారత్‌ వేదికగా రేపటి నుంచి ప్రపంచకప్ సమరం ప్రారంభం కానుంది. పది జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్‌తో తలపడనుంది. చివరి మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 45 లీగ్ మ్యాచ్‌లు, మూడు నాకౌట్ మ్యాచ్‌లు ఉంటాయి. భారత్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్ పాల్గొంటున్నాయి. ఇప్పటికే చాలా మ్యాచ్‌ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అభిమానులు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా టీవీలో, ఆన్‌లైన్‌లో ఈ మెగా టోర్నమెంట్‌ను చూడవచ్చు. ప్రపంచ కప్ 2023 ప్రత్యక్ష ప్రసారం, టెలికాస్ట్ వివరాలు ఇలా..

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ వన్డే ప్రపంచ కప్ 2023 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ ఛానెల్స్‌లో వివిధ ప్రాంతీయ భాషల్లో కామెంట్రీ ఉంటుంది. 

==> స్టార్ స్పోర్ట్స్ 1
==> స్టార్ స్పోర్ట్స్ 1 HD
==> స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ
==> స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ HD
==> స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు
==> స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు HD
==> స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం
==> స్టార్ స్పోర్ట్స్ 1 తమిళ HD
==> స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ

మీరు ఎప్పుడైనా, ఇంట్లో లేదా బయట ఎక్కడైనా వరల్డ్ కప్ మ్యాచ్‌లను లైవ్‌లో చూడాలనుకుంటే.. మీ ఫోన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అన్ని ప్రపంచ కప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని చూడోచ్చు. యాప్ వినియోగదారులకు హాట్‌స్టార్ ఈసారి గుడ్‌న్యూస్ చెప్పింది. వరల్డ్ కప్ మ్యాచ్‌లను చూడటానికి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. మీ మొబైల్ ఫ్రీగా అన్ని మ్యాచ్‌లు చూడొచ్చని వెల్లడించింది.   

మీరు రేడియోలో వరల్డ్ కప్ మ్యాచ్‌ల కామెంట్రీని వినాలనుకుంటే.. ఆల్ ఇండియా రేడియో డిజిటల్ ఛానెల్‌కు వెళ్లాలి. భారత్: ప్రసార భారతి. ఇది కాకుండా మీరు ఐసీసీ అధికారిక డిజిటల్ ఆడియో భాగస్వామి డిజిటల్ 2 స్పోర్ట్స్‌లో ప్రపంచ కప్ మ్యాచ్‌ల కామెంట్రీని వినే అవకాశం ఉంటుంది.

Also Read: ICC World Cup 2023: వరల్డ్ కప్ ఆరంభానికి ముందు బీసీసీఐ షాకింగ్ నిర్ణయం.. నిరాశలో క్రికెట్ అభిమానులు  

Also Read: TSRTC Employees DA: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అన్ని డీఏలు మంజూరు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News