SA vs AUS: ప్రపంచకప్ తుదిపోరుకు ముందు చివరి పోరు ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఫైనల్‌లో టీమ్ ఇండియాతో తలపడే జట్టు ఏదనేది ఇవాళ జరగనున్న దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌తో నిర్ణయం కానుంది.
ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు అత్యంత దురదృష్టకరమైన జట్టుగా పేరుంది. గతంలో సరిగ్గా సెమీఫైనల్స్‌లోనే చివరి బంతికి దక్షిణాఫ్రికా బ్యాటర్ అవుట్ కావడంతో ఫైనల్ అవకాశాలు కోల్పోయింది. దక్షిణాఫ్రికాకు దురదృష్టం వెంటాడటం ఇది తొలిసారి కాదు. గతంలో అంటే 1992, 1999, 2007, 2015లో నాలుగుసార్లు సెమీస్ వరకూ వచ్చి ఆ అడ్డంకిని దాటలేకపోయింది. ఈసారి ఐదవ ప్రయత్నంలో అయినా సెమీస్ అడ్డంకి దాటి తొలిసారి ఫైనల్ చేరేందుకు ఆ జట్టు మానసికంగా సిద్ధమైంది. ఈసారి ప్రపంచకప్‌లో సఫారీ జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్ అంతా భారీ స్కోర్లు చేస్తున్నారు. ఈ టోర్నీలో బలమైన ప్రత్యర్ధులపై 300పైచిలుకు పరుగుల్ని ఐదుసార్లు చేసిన జట్టు దక్షిణాఫ్రికానే. దీన్ని బట్టే తెలుస్తుంది ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ ఎంత పటిష్టంగా ఉందో. డికాక్, డసెన్, మార్క్‌రమ్, క్లాసెన్ అంతా మంచి ఫామ్‌లో ఉన్నవాళ్లే.
ఇక ఐదుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా ప్రారంభంలో వెనుకబడినా ఆ తరువాత దూసుకొచ్చింది. 7 వికెట్లు కోల్పోయినా ఆఫ్ఘనిస్తాన్‌పై మ్యాక్స్‌వెల్ అద్భుతమైన ఆటతో జట్టు ఎలా నెగ్గుకొచ్చిందో అందరికీ తెలిసిందే. ఆస్ట్రేలియా ఓపెనింగ్ ఒక్కటే తడబడుతోంది. అయితే మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉండటంతో నెగ్గుకొస్తోంది. డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్ విధ్వంసకర బ్యాటింగ్ చేయగలరు. అందుకే ఇవాళ్టి సెమీఫైనల్ పోటీ గట్టిగానే ఉండనుంది.
దక్షిణాఫ్రికా జట్టు
టెంబా బవుమా, గెలాల్డ్ కోయెట్టీ, క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిల్ ఫెహ్లూక్వాయో, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, లుంగీ నిగిడి, రబడా, తబ్రైజ్ షంసీ, డస్సెన్, లిజాద్ విలియమ్స్
ఆస్ట్రేలియా
పాట్ కమిన్స్, స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్ వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్
Also read: Ind vs Nz: కివీస్ టాప్ ఆర్డర్ నడ్డి విరిచి..సెమీఫైనల్‌ను షమీ ఫైనల్‌గా మార్చేసిన మొహమ్మద్ షమీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook