IND vs AUS 1st T20: టీమిండియాదే బ్యాటింగ్.. పంత్, బుమ్రాకు దక్కని చోటు! భారత్ తుది జట్టు ఇదే

IND vs AUS 1st T20I Playing 11 Out. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి మ్యాచ్‌ మొహాలీ వేదికగా మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 20, 2022, 07:24 PM IST
  • టీమిండియాదే బ్యాటింగ్
  • పంత్, బుమ్రాకు దక్కని చోటు
  • భారత్ తుది జట్టు ఇదే
IND vs AUS 1st T20: టీమిండియాదే బ్యాటింగ్.. పంత్, బుమ్రాకు దక్కని చోటు! భారత్ తుది జట్టు ఇదే

IND vs AUS 1st T20I Playing 11 Out: స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ మొహాలీ వేదికగా మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో  భారత్‌ ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది. 

ఈ మ్యాచ్‌కు భారత స్టార్ ఆటగాళ్లు రిషబ్‌ పంత్‌, జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యారు. వికెట్‌ కీపర్‌గా దినేష్ కార్తీక్ బాధ్యతలు మోయనున్నాడు. డీకే రాకతో పంత్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. అనూహ్యంగా ఉమేష్ యాదవ్‌కు జట్టులో చోటు దక్కింది. బుమ్రా బెంచ్‌కే పరిమితం అవ్వడం అందరికి షాక్‌కు గురిచేసింది. అయితే టీ20 ప్రపంచకప్‌ 2022 దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు విశ్రాంతిని ఇచ్చి ఉండొచ్చు. 

తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఉమేష్ యాదవ్, యుజ్వేంద్ర చహాల్‌. 
ఆస్ట్రేలియా: ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్), కామెరూన్‌ గ్రీన్, స్టీవెన్‌ స్మిత్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, జోష్‌ ఇంగ్లిస్, టిమ్‌ డేవిడ్, మ్యాథ్యూ వేడ్, ప్యాట్ కమిన్స్‌, నాథన్ ఎల్లిస్, ఆడమ్‌ జంపా, జోష్ హేజిల్‌వుడ్‌. 

Also Read: Janhvi Kapoor Hot Pics: జాన్వీ కపూర్ హాట్ ట్రీట్.. బిగుతైన ఎద అందాలు చూపిస్తూ..!

Also Read: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో రోహిత్‌ శర్మ.. టీ20 ఫార్మాట్‌లో తొలి క్రికెటర్‌గా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News