IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. రెండో టెస్టుకు స్టార్‌ ఓపెనర్‌ దూరం!

Australia Opener David Warner miss remainder of second Test vs India. ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది.  

Written by - P Sampath Kumar | Last Updated : Feb 18, 2023, 10:51 AM IST
  • ఆస్ట్రేలియాకు భారీ షాక్‌
  • రెండో టెస్టుకు స్టార్‌ ఓపెనర్‌ దూరం
  • ఆసీస్ వైద్య బృందం పర్యవేక్షణలో
IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. రెండో టెస్టుకు స్టార్‌ ఓపెనర్‌ దూరం!

Australia Opener David Warner out from 2nd Test with concussion: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంలో ఢిల్లీ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. స్టార్‌ ఓపెనర్‌, సీనియర్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. వార్నర్ స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆసీస్ ఆటగాడు మాథ్యూ రేన్‌షా జట్టులోకి వచ్చాడు. రేన్‌షా ప్రస్తుతం ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే వార్నర్ గాయం తీవ్రతపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దేవ్ భాయ్ ఆసీస్ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. 

ఢిల్లీ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య షూక్రవారం రెండో టెస్ట్ ఆరంభం అయిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్ మొహ్మద్ సిరాజ్‌ వేసిన ఓ బంతి ఆసీస్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ మోచేయికి బలంగా తాకింది. గాయం అయినా వార్నర్ ఫిజియోల సాయంతో బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఆపై వార్నర్‌ను దురదృష్టం వెంటాడింది. ఓ బౌన్సర్ అతడి హెల్మెట్‌కు బలంగా తాకింది. దాంతో ఫిజియో వచ్చి కంకషన్ టెస్ట్ నిర్వహించారు. కొద్దిసేపటికే మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వార్నర్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

భారత్ బ్యాటింగ్‌ సమయంలో డేవిడ్ వార్నర్‌ ఫీల్డింగ్‌కు రాలేదు. అతడికి బదులుగా మాథ్యూ రెన్‌షా 'కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌'గా వచ్చాడు. రెండో జూ కూడా దేవ్ భాయ్ మైదానంలోకి దిగలేదు. దాంతో మిగతా మ్యాచ్‌కూ రెన్‌షా కొనసాగనున్నాడు. వార్నర్‌కు గాయం తీవ్రంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఉస్మాన్ ఖవాజా కూడా వార్నర్‌కు గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలిపాడు. ఇక వార్నర్‌ ప్రస్తుతం పేలవ ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో నిరాశపరిచిన వార్నర్‌.. రెండో టెస్టులో 15 పరుగులు మాత్రమే చేశాడు. గాయం సాకు చెప్పి మొత్తం సిరీస్ కు పాకాన పెట్టిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 

భారత బౌలర్ల దెబ్బకు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్‌ ఖవాజా (81; 125 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్ స్కోరర్. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు తీయగా.. స్పిన్నర్లు ఆర్ అశ్విన్‌, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీశారు. 21/0 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. మూడు వికెట్స్ కోల్పోయింది. రోహిత్‌ శర్మ (32),  కేఎల్ రాహుల్ (17)ను నాథన్‌ లైయన్‌ పెవిలియన్ చేర్చాడు. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ఛెతేశ్వర్ పుజారా (0) డకౌటయ్యాడు.  

Also Read: Mahashivrari 2023: మీ కోరిక నెరవేరాలంటే.. మహా శివరాత్రి నాడు ఈ 10 పరిహారాల్లో ఏదో ఒకటి 'ఒక్కటైనా' చేయండి!

Also Read: Maha Shivratri 2023 Fasting Rules: మహా శివరాత్రి ఉపవాస నియమాలు.. ఉపవాస సమయంలో ఏం తినాలో, ఏం తినకూడదో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News